Trending
Sushanth OTT Debut: ఓటీటీ కోసం ఖాకి చొక్కా వేసిన సుశాంత్?
The First Look poster of Sushanth OTT Debut (Cop Web Series) was unveiled today, marking the actor's birthday: సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా... ఆయన తొలి వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Continues below advertisement
సుశాంత్
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో యువ కథానాయకుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆల్రెడీ ఏయన్నార్ మనవడు నాగచైతన్య ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఏయన్నార్ మనవడు సుశాంత్ కూడా వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వెబ్ సిరీస్ గురించి వివరాలు ప్రకటించడంతో పాటు అందులో ఆయన లుక్ విడుదల చేశారు.
సుశాంత్ కథానాయకుడిగా కొల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. 'జీ 5' ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందుతున్న ఒరిజినల్ సిరీస్ ఇది. ఈ రోజు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వెబ్ సిరీస్‌లో ఆయన లుక్ విడుదల చేశారు.
ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే... సుశాంత్ పోలీస్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. "సుశాంత్ ఇప్పటి వరకూ పోలీస్ పాత్ర చేయలేదు. మా వెబ్ సిరీస్‌లో ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయి" అని వెబ్ సిరీస్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సుశాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
Also Read: 'స్టాండప్ రాహుల్' రివ్యూ: రాజ్ తరుణ్ సినిమా నిలబడిందా? కిందకు పడిందా?
Continues below advertisement
Continues below advertisement