Project Z OTT Release Date: కొన్ని సినిమాలు థియేటర్లలో ఉన్నప్పుడు వాటిని ప్రేక్షకులు గుర్తించరు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మౌత్ టాక్ బాగుంటే అప్పుడే అవి అండర్ రేటెడ్‌గా మిగిలితాయి. యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్‌లో కూడా అలాంటి పలు అండర్ రేటెడ్ సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన మూవీ ‘మాయావన్’. తమిళంలో ‘మాయావన్’ అనే టైటిల్‌తో విడుదలయిన ఈ సినిమా.. తెలుగులో ‘ప్రాజెక్ట్ z’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోస్ట్ అండర్ రేటెడ్ కేటగిరిలో నిలిచిన ఈ మూవీ.. ఫైనల్‌గా ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యింది.


ఫైనల్‌గా..


సీవీ కుమార్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మాయావన్’ 2017లో విడుదలయ్యింది. ఈ మూవీ థియేటర్లలో ఉన్నప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. పైగా అప్పట్లో సోషల్ మీడియా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండకపోవడంతో దీని గురించి చాలామందికి తెలియలేదు కూడా. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత ‘మాయావన్’ థ్రిల్లర్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అసలు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఏ ఇండియన్ సినిమా రాలేదని ప్రశంసించడం మొదలుపెట్టారు. కానీ అదంతా తమిళ వెర్షన్‌కు మాత్రమే. తెలుగు వెర్షన్ అయిన ‘ప్రాజెక్ట్ z’ ఇప్పటికీ ఏ ఓటీటీలో కూడా అందుబాటులో లేదు. దీంతో ఈ బాధ్యతను ఆహా తీసుకుంది.


మతిపోయే ప్రయోగం..


‘ప్రాజెక్ట్ z’ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ‘మాయావన్’ మూవీ లవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫైనల్‌గా వారికి నచ్చిన సినిమాను తెలుగులో చూసే అవకాశం వస్తుందని సంతోషిస్తున్నారు. ‘మనిషి మెదడుపై మతిపోయే ప్రయోగం!’ అనే క్యాప్షన్‌తో ‘ప్రాజెక్ట్ z’కు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది ఆహా టీమ్. అంతే కాకుండా ఈ గ్లింప్స్ చివరిలో మే 31 నుండి ‘ప్రాజెక్ట్ z’ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది కూడా. 2017లో థియేటర్లలో విడుదలయిన ఈ మూవీ ఫైనల్‌గా ఏడేళ్ల తర్వాత తెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.






థ్రిల్లర్ ప్లస్ సైన్స్..


‘ప్రాజెక్ట్ z’లో సందీప్ కిషన్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటించింది. ఇందులో మెయిన్ విలన్‌గా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జాకీ ష్రాఫ్ కనిపించారు. ఒక థ్రిల్లర్ కథలో సైన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు సీవీ కుమార్. సందీప్ కిషన్ కంటే ముందుగా ఈ సినిమా కథ చాలామంది హీరోల దగ్గరకు వెళ్లింది. కానీ ఫైనల్‌గా ఈ యంగ్ హీరో చేతికి వచ్చింది. ఒక డిఫరెంట్ కథతో తెరకెక్కినా కూడా సందీప్ కెరీర్‌లో ఇది ఒక అండర్ రేటెడ్ మూవీగా మిగిలిపోయింది. ఆహాలో స్ట్రీమ్ అయిన తర్వాత ఈ సినిమా చాలామంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందని ‘ప్రాజెక్ట్ z’ లవర్స్ భావిస్తున్నారు.


Also Read: ప్రభాస్ బుల్లి ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ - ముందుగానే ఓటీటీలోకి ‘కల్కి 2898 AD’, డేట్ సేవ్ చేసుకోండి