Allari Naresh's Shubhapradam Movie OTT Streaming: కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటేనే మనకు మ్యూజికల్ హిట్స్ గుర్తొస్తాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ మూవీ 'శుభప్రదం'. అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ జంటగా నటించిన ఈ మూవీ 2010లో విడుదలై మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అయితే... బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
15 ఏళ్ల తర్వాత...
దాదాపు 15 ఏళ్ల తర్వాత అల్లరి నరేష్ మూవీ సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో ఈ సినిమా అందుబాటులో ఉంది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించగా... మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఇండస్ట్రీకి ఎన్నో మంచి హిట్స్ అందించిన విశ్వనాథ్ చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం మళ్లీ డైరెక్టర్‌గా మారారు. ఇదే ఆయన చివరి సినిమా. మూవీలో పాటలన్నీ హిట్‌గా నిలిచినా... బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు.
ఈ మూవీని శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై హరిగోపాల కృష్ణమూర్తి, పీఎన్ తిలక్ నిర్మించారు. నరేష్, మంజరితో పాటు శరత్ బాబు, వైజాగ్ ప్రసాద్, గిరిబాబు, రఘుబాబు, అశోక్ కుమార్, దేవదాస్ కనకాల, జయలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాలా రోజుల తర్వాత ఓ మ్యూజికల్ హిట్ స్ట్రీమింగ్ అవుతుండడంతో ఓటీటీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: 'హరిహర వీరమల్లు'లో విలన్ బాబీ డియోల్ - 'యానిమల్' తర్వాత మరింత పవర్ ఫుల్... ఈ విషయాలు తెలుసా?
స్టోరీ ఏంటంటే?
ఇందు (మంజరి ఫడ్నీస్) సంగీతాన్ని ఇష్టపడే అమ్మాయి. పేరు, పలుకు బడి ఉన్న చాలా పెద్ద ఫ్యామిలీ. ఆమెను చూసిన చక్రి (అల్లరి నరేష్) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తాను ఓ గాయకుడిలా ఇందుకు పరిచయం అవుతాడు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటారు. ఓ రోజు చక్రి స్వతహాగా గాయకుడైనా... ప్రొఫెషనల్ సింగర్ కాదనే విషయం బయటపడుతుంది. దీంతో ఇందు ఫ్యామిలీ అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే... ఇందు చక్రిని అర్థం చేసుకుంటుంది.
ఓ రోజు అనుకోకుండా ఓ వ్యక్తి (శరత్ బాబు) ప్రమాదంలో ఉంటే సాయం చేస్తుంది ఇందు. ఈమె చేసిన సాయానికి తన ఆస్తినే రాసిచ్చేందుకు సిద్ధమవుతాడు ఆ వ్యక్తి. అసలు ఈమెకు ఆ వ్యక్తికి సంబంధం ఏంటి? ఆ ఆస్తి తీసుకునేందుకు ఇందు అంగీకరించిందా? చక్రి సింగర్‌గా మారాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఇక అల్లరి నరేష్ విషయానికొస్తే... ఆయన లాస్ట్ మూవీ 'బచ్చలమల్లి' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. గత కొంతకాలంగా ఆయన ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త మూవీ 'ఆల్కహాల్' అనౌన్స్ చేశారు. ఈ మూవీకి మెహర్ తేజ దర్శకత్వం వహిస్తుండగా రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' మూవీలోని నటిస్తున్నారు.