Upcoming Telugu Movies Web Series List In July Firs Week: మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఈ వారం లేటెస్ట్ మూవీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. అటు ఓటీటీల్లోనూ హిట్ మూవీస్‌తో పాటు ఫేమస్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

నితిన్ 'తమ్ముడు'

యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'తమ్ముడు' జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా... సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరోయిన్ లయ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు మూవీని నిర్మించారు.

హాలీవుడ్ 'జురాసిక్ వరల్డ్'

పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ విశేషంగా ఆకట్టుకున్న 'జురాసిక్ వరల్డ్' మరో కొత్త ప్రపంచం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 4న ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. 'జురాసిక్ వరల్డ్ డొమినియన్' మూవీకి సీక్వెల్‌ ఏడో భాగంగా 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్' పేరుతో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీకి గరేత్ ఎడ్వర్ట్స్ దర్శకత్వం వహించగా... స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ కీలక పాత్రలు పోషించారు.

సిద్ధార్థ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ '3 BHK'

హీరో సిద్ధార్థ్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ '3 బీహెచ్‌కే' జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీగణేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, రఘునాథ్, చైత్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. అరుణ్ విశ్వ మూవీని నిర్మించగా... తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Also Read: 'జయమ్ము నిశ్చయమ్ము రా: జగపతి బాబుతో 'జీ తెలుగు' కోసం 'కల్కి 2898 ఏడీ' నిర్మాణ సంస్థ కొత్త షో - ప్రోమో చూడండి

ఓటీటీ మూవీస్/వెబ్ సిరీస్ లిస్ట్

  • జూన్ 30 - క్యాంపైన్ (ఇంగ్లిష్ మూవీ - జియో హాట్ స్టార్), షార్క్ విష్పరర్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ - నెట్ ఫ్లిక్స్), ది యాక్టర్ (ఇంగ్లిష్ మూవీ - HULU)
  • జులై 1 - ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్ (ఇంగ్లిష్ మూవీ - ప్రైమ్ వీడియో), ఐస్ రోడ్ (ఇంగ్లిష్ మూవీ - ప్రైమ్ వీడియో), ది ఇన్‌స్టిగేటర్స్ (ఇంగ్లిష్ మూవీ - యాపిల్ టీవీ ప్లస్), థండర్ బోల్ట్స్ (ఇంగ్లిష్ మూవీ - ప్రైమ్ వీడియో), అటాక్ ఆన్ లండన్ (ఇంగ్లిష్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), హెర్ మదర్స్ కిల్లర్ (నెట్ ఫ్లిక్స్), టోర్నడో (ఇంగ్లిష్ మూవీ - ప్రైమ్ వీడియో), స్వాంప్ డాగ్ గెట్ హిస్ పూల్ పెయింటెడ్ (ఇంగ్లిష్ మూవీ - ప్రైమ్ వీడియో).
  • జులై 2 - హెడ్స్ ఆఫ్ స్టేట్ (ఇంగ్లిష్ మూవీ - ప్రైమ్ వీడియో), ది ఓల్డ్ గార్డ్ 2 (ఇంగ్లిష్ మూవీ - నెట్ ఫ్లిక్స్)
  • జులై 3 - AIR (తెలుగు వెబ్ సిరీస్ - ఈటీవీ విన్), బాబ్ మార్లే (ఇంగ్లిష్ మూవీ - నెట్ ఫ్లిక్స్), అన్ఎక్స్ యూ (నెట్ ఫ్లిక్స్), ది సాండ్ మ్యాన్ (ఇంగ్లిష్ సిరీస్ ఫైనల్ సీజన్ - నెట్ ఫ్లిక్స్), బ్యాట్ మ్యాన్ (HBO Max), బిచ్ వర్సెస్ రిచ్ (వెబ్ సిరీస్ సీజన్ 2 - నెట్ ఫ్లిక్స్)
  • జులై 4 - మద్రాస్ మ్యాట్నీ (తమిళ్ మూవీ - ప్రైమ్ వీడియో, Tentkotta & SunNXT), గుడ్ వైఫ్ (వెబ్ సిరీస్ - జియో హాట్ స్టార్), ఉప్పు కప్పురంబు (తెలుగు మూవీ - ప్రైమ్ వీడియో), కాళీధర్ లపతా (హిందీ మూవీ - జీ5), ది హంట్ (సోనీ లివ్), ఇన్ ద లాస్ట్ ల్యాండ్స్ (Lions gate Play), ఆల్ ది షార్క్స్ (ఇంగ్లిష్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), సిన్నర్స్ (HBO Max)