యూట్యూబ్, సోషల్ మీడియా సెన్సేషన్ అయిన షణ్ముఖ్ జస్వంత్ కొన్నాళ్ల అజ్ఞాతం అనంతరం మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ‘లీలా వినోదం’ అనే వెబ్ ఫిల్మ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు షణ్ముఖ్ సిద్ధమయ్యారు. ఈ సినిమా వివరాలను తెలిపేందుకు టీమ్ సోమవారం హైదరాబాద్‌లో ఓ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా విశేషాలను తెలిపిన షణ్ముఖ్ జస్వంత్... స్టేజ్‌పై ఎమోషనల్ అయ్యారు. కారణం... ఒకప్పుడు తిరుగులేని స్టార్‌డమ్‌కు చేరువవుతున్న తరుణంలో షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) చేసిన కొన్ని పనులు ఆయనని అయోమయంలో పడేశాయి. ఇంకా చెప్పాలంటే అజ్ఞాతంలోకి వెళ్లేలా చేశాయి. ఒకటి కాదు, ఒకటి తర్వాత ఒకటి ఆయన జీవితంలో ఏదో తప్పు జరుగుతున్నట్లుగా ప్రొజక్ట్ అవుతూనే వచ్చింది. పోలీసు కేసులు, మాదక ద్రవ్యాలతో పట్టుబడటం ఇలా వరస సంఘటనలతో షణ్ముఖ్ లైఫ్ మారిపోయింది. బిగ్ బాస్‌ షో కూడా షణ్ముఖ్‌ని నెగిటివ్‌గానే ప్రజల్లోకి వెళ్లేలా చేసింది తప్పిదే... ఆ షో వల్ల ఆయనకు ఒరిగింది కూడా ఏమీ లేదు. అయినా సరే, మళ్లీ తన సత్తా ఏంటో చాటి, కెరీర్‌ను నిలబెట్టుకునేందుకు షణ్ముఖ్ ‘లీలా వినోదం’తో ప్రయత్నం చేస్తున్నారు. 


ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో తెలియదు కానీ.. ఈ వేడుకలో మాత్రం ఆయన కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. ‘‘చాలా రోజుల తర్వాత నేను మీడియా ముందుకు వచ్చాను. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల తర్వాత కూడా మీడియాలో ఇంత పాజిటివ్‌గా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ‘లీలా వినోదం’ అనే సినిమా చాలా సింపుల్ స్టోరీతో తెరకెక్కింది. ఎంత కాంప్లికేటెడ్‌గా నేను పిచ్చెక్కిపోయేలా ఓవర్ థింకింగ్ చేశాననేదే ఇందులో ఫన్ పార్ట్. అందరూ ఈ సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు. 


Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక మనిషి పడి లేచిన తర్వాత నిలబడటానికి చాలా సపోర్ట్ కావాలి. ఆ విషయంలో నా ఫ్యామిలీ నాకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చింది. నేనున్న కష్టకాలంలో నాకున్న ఇద్దరు ముగ్గురు స్నేహితులు, ఫ్యామిలీ తప్ప అందరినీ పక్కన పెట్టేశాను. వారే నా బ్యాక్‌ బోన్‌లా నిలిచి సపోర్ట్ అందించారు. నా చుట్టూ ఉన్న సంఘటనలతో బాధపడ్డానా? నా రిలేషన్ బ్రేకప్ వల్ల బాధపడ్డానా? అంటే.. ముఖ్యంగా రిలేషన్‌ అంటే ఒక్కరు కాదు ఇద్దరు ఉంటారు. నా ఒక్కడిదే పెయిన్ అని మాత్రం అనుకోను. ఈ విషయంలో నేను ఎవరినీ నిందించడం లేదు. ఇద్దరికీ పెయిన్ ఉంటుంది. కానీ, ఈ పెయిన్ నుండి ఇద్దరూ బయటికి రావాలని, ఎవరి ప్లేస్‌లో వాళ్లు బాగుండాలని కోరుకుంటాను’’ అని షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.


‘లీలా వినోదం’ను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయడానికి కారణం చెబుతూ.. దీనిని థియేటర్‌లో విడుదల చేస్తే.. ఎవరు కొంటారు, ఎంత మంది సినిమా చూస్తారనేది నాకు ఐడియా లేదు. ఓటీటీలో అయితే నాకొక ఐడియా వస్తుంది, పీపుల్‌కి ఇది సరైన వేదిక కూడా. ఒక్కటే మాట షణ్ముఖ్ జశ్వంత్ ఈజ్ బ్యాక్ అంటూ మళ్లీ తన జీవితాన్ని మొదటి నుండి మొదలు పెడుతున్నట్లుగా షన్ను క్లారిటీ ఇచ్చాడు. నటి దీప్తి సునయనతో షణ్ముఖ్ రిలేషన్ మెయింటైన్ చేసి.. ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.


Also Readనిఖిలే విన్నర్... ట్రోఫీ ఇచ్చిన రామ్ చరణ్, స్టార్స్ సందడి - బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఏంటో చూడండి