సూర్యను సూర్య కలిశారు. అదేంటి? సూర్యను సూర్య కలవడం ఏమిటి? అనే సందేహం వచ్చింది కదూ! తమిళ స్టార్ హీరో, తెలుగులోనూ స్టార్‌డమ్ సొంతం చేసుకున్న సూర్య ఉన్నారు కదా! ఆయన్ను రీల్ లైఫ్ సూర్య కలిశారు. అదేనండీ షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్ కోసం షణ్ముఖ్ జస్వంత్ 'సూర్య' అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ సూర్యను రీల్ లైఫ్ సూర్య కలిశారన్నమాట.
సూర్యను కలిసినందుకు షణ్ముఖ్ జస్వంత్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన ఫేవరేట్ హీరో కాబట్టి. అవును... తమిళ హీరో సూర్యకు షన్ను పెద్ద ఫ్యాన్. 'ఈటీ' ప్రచరం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన సూర్యను కలిశారు. షన్నును చూసిన సూర్య హగ్ చేసుకున్నారు. దాంతో షన్ను ఆనందానికి అవధులు లేవు. "సూర్య అన్నా... ఐ లవ్ యు. 3-3-2022... ఎప్పటికీ హ్యాపీయెస్ట్ డే. కొన్ని నెలలుగా చాలా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నారు" అని షణ్ముఖ్ జస్వంత్ పేర్కొన్నారు.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన షణ్ముఖ్ జస్వంత్
'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన దీప్తి సునైనతో బ్రేకప్... షోలో షన్ను - సిరి ఫ్రెండ్షిప్ మీద విమర్శలు - ట్రోల్స్ రావడం వంటివాటిని ఉద్దేశించి షణ్ముఖ్ జస్వంత్ ఫెయిల్యూర్స్ అన్నారేమోనని అతడి ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read: 'మా బ్రేకప్ కు కారణం సిరి కాదు' అసలు విషయం చెప్పిన షణ్ముఖ్