Sapta Sagaralu Dhaati Side B OTT: గత ఏడాది విడుదలయిన ఎన్నో కన్నడ చిత్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘సప్త సాగరాలు దాటి’. ఈ మూవీ పూర్తిస్థాయి లవ్ స్టోరీలాగా తెరకెక్కినా.. దీనిని ఒక భాగంలో పూర్తి చేయకుండా రెండు పార్ట్స్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. మొదటి భాగం విడుదలయ్యి సూపర్ హిట్ అందుకోగానే రెండు నెలల వ్యవధిలోనే ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యి చాలాకాలమే అయినా ఇంకా ఓటీటీలోకి రాలేదని ఫ్యాన్స్ ఫీలవుతుండగా.. సర్‌ప్రైజ్‌లాగా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’.


ఇద్దరు హీరోయిన్లు..


‘సప్తా సాగరదాచె ఎల్లో’ మూవీని ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌తో తెలుగులో డబ్ చేశారు మేకర్స్. ముందుగా ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఏ’ మూవీ థియేటర్లలో విడుదలయ్యి సూపర్ హిట్‌ను సాధించింది. సినిమా చూసిన వారందరినీ ఎమోషనల్ చేసింది. హేమంత్ ఎమ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రక్షిత్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. ఇక సైడ్ ఏ విడుదలయ్యి సూపర్ హిట్ అందుకుంది కాబట్టి సైడ్ బీ మూవీని కూడా రెండు నెలలలోపే థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. సైడ్ ఏకు ఏ విధంగా ఆదరణ లభించిందో.. సైడ్ బీకు కూడా అలాంటి పాజిటివ్ ఫీడ్ బ్యాకే దక్కింది. ‘సప్తా సాగరాలు దాటి సైడ్ ఏ’ మూవీ థియేటర్లలో రన్ అవుతున్నప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ సైడ్ బీకి మాత్రం మేకర్స్ చాలా సమయం తీసుకున్నారు. 


అర్థరాత్రి నుండే స్ట్రీమింగ్..


‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ ఇంకా ఓటీటీలో విడుదల అవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమవుతుందని హీరో రక్షిత్ శెట్టి అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఇక తను అప్డేట్ ఇచ్చిన వారం రోజుల్లోనే ఈ మూవీ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. జనవరి 25 అర్థరాత్రి నుండే ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ ప్రైమ్‌లో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఏ’లో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక సైడ్ బీలో వీరిద్దరితో పాటు చైత్ర జే ఆచార్ కూడా కీలక పాత్రలో కనిపించింది. తన యాక్టింగ్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.


వైలెన్స్ డోస్ పెంచాడు..


‘సప్త సాగరాలు దాటి సైడ్ ఏ’లో వైలెన్స్ ఎక్కువగా చూపించని దర్శకుడు హేమంత్.. సైడ్ బీలో మాత్రం వైలెన్స్ శాతాన్ని కాస్త ఎక్కువగానే పెట్టాడు. పరమ్వాహ్ స్టూడియోస్ రెండు భాగాలను నిర్మించింది. చరణ్ రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాకు ప్రాణంగా నిలిచింది. నవంబర్ 17న ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. ఆ తర్వాత నెలరోజులకే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని ప్రచారం కూడా మొదలయ్యింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ పార్ట్‌నర్ అంటూ పోస్టర్ కూడా విడుదలయ్యింది. కానీ ఉన్నట్టుండి ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ ఓటీటీ రిలీజ్ ఆగిపోయింది. ఫైనల్‌గా ఇన్నాళ్లకు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎమోషనల్ అయిన ఆడియన్స్.. మరోసారి ఓటీటీలో కూడా దీనిని చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు.


Also Read: ‘జై హనుమాన్’లో బాలీవుడ్ హీరో - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ప్రశాంత్ వర్మ