Heeramandi Release Date Is Out Now: ప్రతీ దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. దానికోసం ఎంత బడ్జెట్ అయినా, ఎన్నిరోజులు అయినా కేటాయించడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టే ‘హీరామండి’. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ సీనియర్‌తో పాటు జూనియర్ హీరోయిన్లు కూడా చేతులు కలిపారు. ఆరుగురు హీరోయిన్లు లీడ్ రోల్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను చాలా గ్రాండ్‌గా ప్రకటించింది టీమ్. ‘హీరామండి’ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలానే ఉంది. అందుకే వారందరి ఎదురుచూపులకు చెక్ పెడుతూ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. 


ఈవెంట్‌తో ప్రకటన..


‘మీరు ఎదురుచూస్తున్న మూమెంట్ వచ్చేసింది. సంజయ్ లీలా భన్సాలి మొదటి ఎపిక్ సిరీస్ హీరామండి ది డైమండ్ బజార్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో మే 1న విడుదల కానుంది’ అంటూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోతో ప్రకటించారు మేకర్స్. ఈ రిలీజ్ డేట్ ప్రకటన కోసం ముంబాయ్‌లో ఒక గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ఆకాశంలో ‘హీరామండి’ విడుదల తేదీని రివీల్ చేసింది. ఈ ఈవెంట్‌కు ‘హీరామండి’ మేకర్స్‌తో పాటు అందులో నటించిన నటీమణులు కూడా పాల్గొన్నారు. దీనిని చూడడానికి ఎంతోమంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. ఫైనల్‌గా సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.






మనీషా గ్రాండ్ రీ ఎంట్రీ..


సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్.. ‘హీరామండి’లో లీడ్ రోల్స్‌లో నటించారు. కొన్నిరోజుల క్రితం ఈ వెబ్ సిరీస్ నుండి విడుదలయిన లుక్‌లో వీరంతా అచ్చం మహారాణుల్లాగా మెరిసిపోయారు. ఎవరికి వారు వారి ప్రెజెన్స్‌తో ఫస్ట్ లుక్‌కు ప్రత్యేకమైన అందాన్ని యాడ్ చేశారు. చాలాకాలం తర్వాత మనీషా కొయిరాల.. ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమయ్యింది. ఇంతకు ముందు కూడా ఒకట్రెండు హిందీ చిత్రాల్లో నటించినా కూడా ‘హీరామండి’లో మాత్రం తను లీడ్‌గా కనిపించనుంది. ఎన్నేళ్ల అయినా మనీషా అందం, ఛార్మ్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


వేశ్యల కథ..


మొఘల్స్ కాలంలో రాజ వంశీయులకు, రాజ కుటుంబీలకు అందుబాటులో ఉన్న వేశ్యల కథే ‘హీరామండి’. అంటే ఇందులో లీడ్‌గా నటిస్తున్న ఆరుగురు హీరోయిన్లు వేశ్యల పాత్రలో కనిపించనున్నారు. భారత్, పాక్ విడిపోయాక లాహోర్ కు సమీపంలో ఉన్న షాహి మొహల్లా అనే ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. చాలాకాలం క్రితమే ‘హీరామండి’ కథతో ఒక సినిమాను తెరకెక్కించాలని సంజయ్ లీలా భన్సాలీ అనుకున్నారు. కానీ అది కుదరలేదు. మొత్తానికి ఇంతకాలం తర్వాత వెబ్ సిరీస్ రూపంలో మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో ‘హీరామండి’ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. 14 ఏళ్లుగా దీనికోసం శ్రమిస్తున్నానని సంజయ్ ఒక సందర్భంలో బయటపెట్టారు.


Also Read: ఓ మై గాడ్‌.. మీకు ఫుల్‌గా పడిపోయానండి బాబూ! - అంచనాలు పెంచేస్తున్న ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌