Rakshit Shetty Decides To Release Ekam on His Own Platform: నటి రష్మిక మాజీ ప్రియుడు... నేష‌న‌ల్ అవార్డు విజేత‌, యాక్ట‌ర్, డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ ర‌క్షిత్ శెట్టి గుండె పగిలిందట. అయితే ఈ సారి ప్రేమ విఫలమై కాదు.. తాను స్వయంగా నిర్మించిన వెబ్ సీరిస్‌ను ఏ ఓటీటీ సంస్థ కొనుగోలు చేయడం లేదని. ఆ మనస్తాపంతో రక్షిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అల్లు అర్జున్ బాటపట్టాడు. తానే సొంతంగా ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసుకున్నాడు. త‌ను తీసిన 'ఏక‌మ్’ వెబ్ సిరీస్‌ను తన ఓటీటీలో జులై 13న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2021 నుంచి రిలీజ్ కి నోచుకోని త‌న సిరీస్ ని 2024 లో తానే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్న‌ట్లు 'ఎక్స్' ద్వారా చెప్పారు ఆయ‌న‌. 


ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నాం.. కానీ ఆడియెన్స్ చేరాలనే.. 


హీరో ర‌క్షిత్ యాక్టింగ్ మాత్ర‌మే కాదు.. ఆయ‌న ద‌ర్శ‌కుడిగా, ప్రొడ్యూస‌ర్ గా కూడా ఎన్నో సినిమాలు చేశారు. అలానే 'ఏక‌మ్' అనే వెబ్ సిరీస్ కి ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు ర‌క్షిత్. అయితే, 2020లో మొద‌లైన షూటింగ్ ప్యాండ‌మిక్ కార‌ణంగా వాయిదా ప‌డింది. 2021 లో దీన్ని పూర్తి చేసిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ రిలీజ్ కి నోచుకోలేదు. దీంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న ఒక నోట్ రాసుకొచ్చారు.  


"2020 జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి అనుకుంటా.. మేం 'ఎక‌మ్' వెబ్ సిరీస్ మొద‌లుపెట్టాం. ఆ టైమ్‌లో వాతావ‌ర‌ణం కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ, మేమంతా ఉత్సాహంగానే ఉన్నాం. వెబ్ సిరీస్ ని మొద‌లుపెట్టాల‌ని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే క‌న్న‌డలో వెబ్ సిరీస్ తీసేందుకు అది మంచి టైం అనిపించింది మాకు. కానీ, వెంట‌నే ప్యాండ‌మిక్. ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌య్యాయి. ఏం చేయాలో తెలియ‌ని భ‌యం, ఫ్ర‌స్టేష‌న్. కానీ, మేం దాన్ని వ‌ద‌లలేదు. అక్టోబ‌ర్ 2021లో ఫైన‌ల్ క‌ట్ చూశాను. రిలీజ్ కోసం వెయిట్ చేశాం. ప్ర‌పంచానికి చూపించాల‌ని చాలా ఆత్రుత‌గా ఉన్నాను. కానీ, మేం అనుకున్న‌ట్లు ఏదీ జ‌ర‌గ‌లేదు. ఏక‌మ్ ని రిలీజ్ చేసేందుకు ఈ రెండేళ్ల‌లో మేం చేయని ప్రయత్నం లేదు. అప్రోచ్ అవ్వ‌ని ఓటీటీ లేదు. కానీ, ఎవ్వ‌రూ తీసుకోలేదు. దారుల‌న్నీ మూసుకుపోయాయి. కానీ, మేం ఎక్క‌డ వెన‌క్కి త‌గ్గ‌లేదు. కంటెంట్ బాగుందా?  లేదా? అని డిసైడ్ చేసే హ‌క్కు ఆడియెన్స్ కి ఉంది. అందుకే, మా సొంత ఫ్లాట్ ఫాంలో 'ఏక‌మ్'ని రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యాం. మీకు న‌చ్చొచ్చు, న‌చ్చ‌క పోవ‌చ్చు. కానీ, క‌చ్చితంగా కంటెంట్ ని మాత్రం కొట్టి పారేయ‌లేరు. మా ఈ ప్ర‌య‌త్నాన్ని గుర్తించాలి, మెచ్చుకోవాలి. మేం ఎంత ప్రేమించి తీశామో.. మీరు కూడా  క‌చ్చితంగా అంతే ప్రేమిస్తారు కూడా" అంటూ ట్వీట్ చేశాడు ర‌క్షిత్ శెట్టి. 


2010లో సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ర‌క్షిత్ శెట్టి. 2022లో 'ఛార్లీ 777'  సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఆయ‌న‌. ర‌క్షిత్ శెట్టి నటించిన 'స‌ప్త‌రాగాలు దాటి పార్ట్ - ఏ', దానికి కొన‌సాగింపుగా వ‌చ్చిన 'పార్ట్ -బి' రెండూ తెలుగులో సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక 'ఏక‌మ్' వెబ్ సిరీస్ విష‌యానికొస్తే.. ఈ సిరీస్‍కు సందీప్ పీఎస్, సుమంత్ భట్ డైరెక్ట‌ర్లు కాగా.. పరంవాహ్ స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి నిర్మించాడు. ఈ సిరీస్ లో ప్ర‌కాశ్ రాజు, రాజ్ బి శెట్టి, షైన్ శెట్టి త‌దిత‌రులు న‌టించారు. 


ఫీజు కట్టాల్సిందే... 


2021 నుంచి ఈ సిరీస్ ని రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నించింది టీమ్. కానీ, అది వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. దీంతో www.ekamtheseries.comలో రిలీజ్ చేస్తున్నారు. అయితే, అక్క‌డ చూడాలంటే రూ.149 క‌ట్టాల్సిందే. ఈ 149 రూపాయ‌ల‌కు కేవ‌లం ఎక‌మ్ సిరీస్ కాకుండా, మరింత కొత్త కంటెంట్ కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఎంత‌మంది ఈ సిరీస్ చూస్తారో వేచి చూడాల్సి ఉంది. అయితే, ఈ ఓటీటీని అదే పేరుతో సీరియస్‌గా నడుపుతాడో లేదా.. ఆ సీరిస్‌కు మాత్రమే పరిమితం చేస్తాడో తెలియాల్సి ఉంది.


దీనికి ప‌రిష్కారం ఆలోచించాల్సిందే.. 


ఈ విష‌యంపై స‌ప్తసాగ‌రాలు దాటి సినిమా డైరెక్ట‌ర్ హేమంత్ రావు కూడా స్పందించారు. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ ఇలాంటి పరిస్థితుల‌పై ఆలోచించాలి. ఏదైనా చేయాలి. “ నేను కూడా చాలా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేవాడిని. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ క‌న్న‌డ సినిమాల‌ను ఎందుకు తీసుకోవో అర్థం కాదు. నేను బిజినెస్ ఎన‌ల‌ెటిక్స్‌లో వాళ్ల వైపు ఆలోచిస్తే.. క‌ర్నాట‌క మ‌ల్టీ క‌ల్చ‌ర‌ల్, కాస్మొపొలిటియ‌న్ అని చెప్తాను. త‌మిళ్, తెలుగు, హిందీ, మ‌ల‌యాళం భాష ఏదైనా క‌ర్నాట‌క‌లో మంచి బిజినెస్ ఉంటుంది. ఏ సౌత్ స్టేట్ లో అలా ఉండ‌దు. దుర‌దృష్టం ఏంటంటే లోక‌ల్ ల్యాంగ్వేజ్ కి అంద ఆద‌ర‌ణ లేదు ఇక్క‌డ‌. దాని వ‌ల్ల బిజినెస్ కూడా ఉండ‌దు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఫ్లాట్ ఫామ్స్ తెలుగు కంటెంట్ తీసుకుంటే దాదాపు సబ్ స్క్రిప్ష‌న్ మొత్తం బెంగ‌ళూరు, క‌ర్నాట‌క నుంచే ఉంటుంది” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  


Also Read: పీకల్లోతు ప్రేమలో ‘సాహో’ భామ - ఎట్టకేలకు ప్రియుడి పేరు చెప్పేసిన శ్రద్ధా కపూర్, ఇంతకీ అతడు ఎవరో తెలుసా?