Akhil Raj's Raju Weds Rambai OTT Platform Locked : అఖిల్ రాజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తేజస్వి రావు జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ లవ్ ఎంటర్టైనర్ 'రాజు వెడ్స్ రాంబాయి'. సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ అయ్యింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీని 'నీది నాదీ ఒకటే కథ', 'విరాట పర్వం' మూవీస్‌తో పాపులర్ అయిన వేణు ఊడుగుల నిర్మించారు. రాహుల్ మోపిదేవి, ఈటీవీ విన్‌లతో కలిసి సినిమాను నిర్మించారు. అంతకు ముందు ఈటీవీ విన్ నిర్మాణంలో వచ్చిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'లిటిల్ హార్ట్స్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూవీ టీం ఫుల్ ఖుష్ అవుతోంది.
Also Read : హీరోయిన్ ఇష్యూలో దర్శకుడికి సుడిగాలి సుధీర్ కొత్త సినిమా టీం సపోర్ట్... నరేష్ మంచోడంటూ!
స్టోరీ ఏంటంటే?
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సాయిలు కంపాటి చెప్పినట్లుగానే ఇది ఓ పల్లెటూరి మన ఊరి లవ్ స్టోరీ. ఉమ్మడి ఏపీ వరంగల్ ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరిలో రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ వాయించడంలో దిట్ట. అదే ఊరిలో ఉండే రాంబాయి (తేజస్వి రావు)ని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తుంటాడు. తొలుత అతని లవ్‌ను లైట్ తీసుకున్నా... ఆ తర్వాత రాజు ప్రేమలో నిజాయతీని చూసి ఇష్టపడుతుంది రాంబాయి. అయితే, రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) ఆమెకు ఓ గవర్నమెంట్ ఆఫీసర్‌ను చూసి పెళ్లి చేయాలని అనుకుంటాడు.
చిన్నప్పటి నుంచి కూతుర్ని ప్రేమగా చూసుకుంటాడు. రాంబాయి తండ్రి ఆలోచన తెలుసుకున్న రాజు పెళ్లికి ముందే ఆమెను గర్భవతిని చేస్తే... తనకే ఇచ్చి పెళ్లి చేస్తాడని భావిస్తాడు. ఈ విషయం రాంబాయికి చెప్పి వాళ్లు అలాగే చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వెంకన్న వల్ల రాజు రాంబాయిల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? రాజుకు బుద్ధి చెప్పేందుకు వెంకన్న ఏం చేశాడు? చివరకు వాళ్లిద్దరూ కలిశారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.