Manoj Bajpayee's The Family Man 3 Web Series OTT Streaming : బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన అవెయిటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'. రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నుంచి రెండు సీజన్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అంతకు మించి థ్రిల్ పంచేందుకు మూడో సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేసింది.
కొత్త సిరీస్... ఎన్ని ఎపిసోడ్స్ అంటే?
గురువారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కొత్త సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల వరకూ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్ (TASK)లో సీనియర్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ మళ్లీ రాబోతున్నారు. ఓ హత్య కేసు ప్రధానాంశంగా ఆ తర్వాత జరగబోయే పరిణామాలు... దేశంలో జరిగే ఓ కుట్రను తివారి ఎలా వెలికితీశాడో చూపించనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
సిరీస్‌లో మనోజ్ బాజ్ పాయ్‌తో పాటు ప్రియమణి, విలన్‌గా జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ కీలక పాత్ర పోషించారు. అలాగే, అశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్, అభయ్ వర్మ, సన్నీ హిందూజా, షబీర్ హష్మీ, వేదాంత్ సిన్హా కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ సీజన్ 2019లో, సెకండ్ సీజన్ 2021లో వచ్చి ట్రెండ్ సృష్టించాయి. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మూడో సీజన్ వస్తుండడంతో అందరూ ఆసక్తి నెలకొంది.
Also Read : నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా - 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్
మెగాస్టార్ వద్దనుకున్న స్టోరీ
నిజానికి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే, ఈ సిరీస్ స్టోరీ ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లిందని తెలుస్తోంది. రాజ్ & డీకే కథను నిర్మాత అశ్వినీదత్‌కు వినిపించగా... ఆయనకు బాగా నచ్చి చిరంజీవికి చెప్పారట. అయితే, ఇద్దరు పిల్లల తండ్రిగా ఆడియన్స్ ఆమోదిస్తారో లేదో అనే సందిగ్ధంలో పడి ఆయనతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు.
సీజన్ 3లో స్టోరీ ఏంటంటే?
ఫస్ట్ సీజన్లో థ్రెట్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ తివారీ అండ్ టీం దేశానికి పొంచి ఉన్న ప్రమాదాలను ముందే పసిగట్టి అవి రాకుండా చేస్తుంటుంది. దేశం కోసం సీక్రెట్ ఏజెంట్‌గా చేస్తూనే ఓ మధ్య తరగతి తండ్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తుంటాడు. అలా సీజన్ 1లో ఉగ్ర చర్యల నుంచి దేశాన్ని ఎలా కాపాడారనేది? చూపించారు. ఇక రెండో సీజన్‌లో తమిళ రెబల్స్, శ్రీలంకలో ఎల్టీ పోరాట గ్రూప్ బ్యాక్ డ్రాప్‌లో చూపించారు. ఇక మూడో సీజన్‌లో దేశ రక్షణ కోసం ఏజెంట్‌గా పని చేసిన శ్రీకాంత్ తివారి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారినట్లు ట్రైలర్‌లో చూపించారు. అందుకు గల కారణాలేంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.