Allari Naresh's 12A Railway Colony Movie OTT Partner Locked : టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, 'పొలిమేర' ఫేం కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ'. 'పొలిమేర' ఫ్రాంచైజీ చిత్రాల దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరించారు. ఈ నెల 21న శుక్రవారం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందే ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది.

Continues below advertisement


ఏ ఓటీటీలో వస్తుందంటే?


'12A రైల్వే కాలనీ' మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకుంది. మూవీ రిలీజ్ అయి థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల మధ్యలో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కామెడీ మూవీస్‌తో అందరినీ నవ్వించిన అల్లరి నరేష్... రీసెంట్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ చుట్టూ మూవీ సాగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తుండగా... ఆ హత్యలు ఎవరు చేశారు? వాటి గురించి హీరోకు ఎలా తెలిసింది? మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారు? అనే దానిపై హైప్ క్రియేట్ అవుతోంది.


Also Read : నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా - 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్


ఈ మూవీలో అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్లతో పాటుగా డైలాగ్ కింగ్ సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, మధుమణి, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిల్ విశ్వనాథన్ షో రన్నర్‌గా వ్యవహరించగా... నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి మూవీని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.