దర్శకుడు నరేష్ కుప్పిలి మీద హీరోయిన్ దివ్యభారతి ఫైర్ అయ్యారు. 'చిలకా' అని తనను కామెంట్ చేయడంపై ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రీకరణలోనూ తన పట్ల నరేష్ కుప్పిలి నీచమైన కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. 'సుడిగాలి' సుధీర్ మౌనంగా ఉండటం తనను డిజప్పాయింట్ చేసిందని తెలిపారు. ఈ వివాదంలో హీరో కొత్త సినిమా 'హైలెస్సో' టీం రియాక్ట్ అయ్యింది.

Continues below advertisement

నరేష్ కుప్పిలికి 'హైలెస్సో' టీమ్ సపోర్ట్!''డియర్ నరేష్... నాకు, శివ గారికి, 'హైలెస్సో' చిత్ర బృందానికి అండగా నిలిచినందుకు థాంక్స్. సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ, అంకితభావం, నిబద్ధత మాకు తెలుసు. మేల్, ఫిమేల్ ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు మీరు ఇచ్చే గౌరవం కూడా తెలుసు. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది'' అని 'హైలెస్సో' దర్శకుడు ప్రసన్న కుమార్ కోట ట్వీట్ చేశారు. 'హైలెస్సో' టీమ్ కూడా ఇంచు మించు సేమ్ ట్వీట్ చేసింది. మాటల కంటే చేతలు ఎక్కువ మాట్లాడతాయని నరేష్ కుప్పిలి రిప్లై ఇచ్చారు.

Also Read: మరి ఏం చేయాలి... గడ్డి పీకాలా? - ప్రియదర్శి వైరల్ ట్వీట్

Continues below advertisement

దివ్యభారతి చేసిన కామెంట్స్ పట్ల గాని, ఈ వివాదం పట్ల గాని సుడిగాలి సుధీర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన కొత్త సినిమా టీమ్ రియాక్ట్ కావడం - సుధీర్ మౌనంగా ఉండటం తనను డిజప్పాయింట్ చేసిందని దివ్యభారతి పేర్కొనడం చూస్తుంటే... నరేష్ కుప్పిలికి సుధీర్ సపోర్ట్ ఉందని అనుకోవాలేమో!?

Also Readప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ

బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన సుడిగాలి సుధీర్, ఆ తర్వాత వెండితెరకు వచ్చారు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. ఆ తర్వాత హీరో అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'హైలెస్సో' చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత కొన్ని రోజులుగా సైలెంట్ అయిన 'గోట్' టీంలో కదలిక వచ్చింది. అందులో సాంగ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే 'గోట్' నిర్మాతలకు, దర్శకుడికి మధ్య ఏదో వివాదం వచ్చినట్టు అర్థం అవుతోంది. డైరెక్టర్ పేరు పోస్టర్స్ మీద, పాటల్లో తీసేశారు. ఆయనకు క్రెడిట్ ఇవ్వడం లేదు.