'హరిహర వీరమల్లు' సినిమా ఫస్టాఫ్ బావుందని థియేటర్లలో విడుదల తర్వాత మంచి రిపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో యాక్షన్ సీక్వెన్సులు అన్నీ చాలా బాగా వచ్చాయని పేరు వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ టైంలో సెకండాఫ్ మీద విమర్శలు వచ్చాయి. సినిమా ఓటీటీలోకి వచ్చేసరికి ఆ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేశారనుకోండి. సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నిటి కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్రో ఫైట్ బావుందని ఫ్యాన్స్ నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ ఫైట్ ఫ్రీగా చూడొచ్చని తెలుసా?
యూట్యూబ్‌లో వీరమల్లు ఇంట్రడక్షన్ ఫైట్!Hari Hara Veera Mallu Pawan Kalyan Introduction Fight: ఇప్పుడు 'హరి హర వీరమల్లు' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వెర్షన్స్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. థియేట్రికల్ ప్రింట్‌తో కంపేర్ చేస్తే రన్ టైమ్ తగ్గింది. క్లైమాక్స్ మారింది. కానీ ఫస్ట్ ఫైట్ మాత్రం మారలేదు.
'హరి హర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ మాత్రం మారలేదు. అందులో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఆ యాక్షన్ సీక్వెన్సును యూట్యూబ్‌లో విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ. ఆడియన్స్ అందరూ ఆ ఫైట్ ఫ్రీగా చూడొచ్చు.
Also Read: పరదా కలెక్షన్లు... మలయాళంలో ఢమాల్ - తెలుగులో పరిస్థితి ఎలా ఉందంటే?
ఓటీటీలో వీరమల్లుకు స్పందన బావుందిగా!థియేట్రికల్ రెస్పాన్స్ కంటే ఓటీటీలో విడుదలైన 'హరి హర వీరమల్లు'కు స్పందన బావుంది. థియేటర్లలో గనుక ఈ ప్రింట్ విడుదలై ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని పవర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి కంప్లిమెంట్స్ వస్తున్నాయి. సెకండ్ పార్ట్ ఉంటే గనుక స్పందన దృష్టిలో పెట్టుకుని చేసే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ సరసన పంచమి పాత్రలో నిధి అగర్వాల్ నటించిన 'హరి హర వీరమల్లు'లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించారు. ఇతర కీలక పాత్రల్లో నాజర్, సత్యరాజ్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజ్, దిలీప్ తాహిర్, తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్ తదితరులు కనిపించారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Also Read: పరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!