Surya Srinivas's Brahmavaram PS Paridhilo OTT Streaming On Amazon Prime Video: క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏడాది క్రితం థియేటర్లలోకి వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇప్పుడు సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది ఆగస్ట్ 23న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కాస్త పర్వాలేదనిపించింది. ఈ మూవీలో రూపా లక్ష్మి, హర్షిణి, బెల్లంకొండ స్రవంతి, సమ్మెట గాంధీ, జీవా, ప్రేమ్ సాగర్ కీలక పాత్రలు పోషించారు.
ఓ ఊరిలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సరిగ్గా ఏడాది తర్వాత సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో రెంటల్ విధానంలో ప్రస్తుతానికి స్ట్రీమింగ్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి ఫ్రీగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
స్టోరీ ఏంటంటే?
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే బ్రహ్మవరం అనే ఊరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ఓ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. చైత్ర (స్రవంతి బెల్లంకొండ) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంది. తనను ప్రేమించే వాడే భర్తగా రావాలని కలలు కంటుంది. తనకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ చూసి సూర్య (సూర్య శ్రీనివాస్) ను లవ్ చేస్తుంది. ఇక గౌతమ్ (గురుచరణ్) తన ఎదుట ఎవరైనా తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. ఇతని తండ్రి పట్టాభి ఆ ఊరిలో కానిస్టేబుల్‌గా చేస్తుంటాడు.
ఓ సందర్భంలో బ్రహ్మవరం ఎస్ఐకు గౌతమ్‌కు గొడవ జరుగుతుంది. ఇదే టైంలో పీఎస్ దగ్గర ఓ శవం దొరుకుంది. ఈ కేసు సంచలనంగా మారగా... పోలీసులు విచారణ చేపడతారు. ఇదే సమయంలో అమెరికా నుంచి చైత్ర ఇండియాకు వస్తుంది. అసలు చనిపోయింది ఎవరు? గౌతమ్‌ను కలిసేందుకు చైత్ర ఎందుకు ఇండియాకు వచ్చింది? ఆ శవానికి గౌతమ్‌కు సంబంధం ఏంటి? సూర్య, చైత్రల లవ్ ఏమైంది? అనేది తెలియాలంటే ఇప్పుడే మూవీని చూసేయండి.