Kingdom Of The Planet Of The Apes OTT ReleaseDate: ఏప్స్ అనే ఒక జీవిని తీసుకొని దానిపై సినిమాలు తెరకెక్కించి హాలీవుడ్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా ఈ సినిమాల ఫ్రాంచైజ్‌కు హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఇటీవల నాలుగో సినిమాగా 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' కూడా థియేటర్లలో హిట్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యి రెండు నెలలు అవుతుండగా.. తాజాగా దీని ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ బయటికొచ్చి ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది.


ఓటీటీ అప్డేట్..


ఇప్పటివరకు ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంచైజ్‌లో 'రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్', 'డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్', 'వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' లాంటి మూడు చిత్రాలు వచ్చాయి. అందులో ఈ ఫ్రాంచైజ్‌లో నాలుగో సినిమా అయిన 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలు అందుకుంటూ ఈ సినిమా థియేటర్లలో విడుదవ్వగానే మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినవారు.. ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.


అధికారిక ప్రకటన..


ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' విడుదలకు సిద్ధమయ్యింది. ఆగస్ట్ 2న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. హాట్‌స్టార్ ఈ విషయాన్ని అఫీషియల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. ‘ఇది కొత్త సామ్రాజ్యం. ఏప్స్ తలరాత, మనుషుల తలరాత బ్యాలెన్స్ అయ్యింది’ అనే క్యాప్షన్‌తో ఈ ఓటీటీ రిలీజ్ గురించి ప్రకటించింది. దీంతో ప్లానెట్ ఆఫ్ ఏప్స్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.






టేకింగ్‌కు మార్కులు..


'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'లో ఓవెన్ టేగ్, ఫ్రెయా ఆలన్, కెవిన్ డురాండ్, పీటర్ మ్యాకన్ ముఖ్య పాత్రలో నటించారు. దర్శకుడు వెస్ బాల్.. తన టేకింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తానికి సైన్స్ ఫిక్షన్, యాక్షన్ కలిపిన ఈ సినిమా.. థియేటర్లలో విడుదలయిన రెండు నెలల్లోనే ఈ మూవీ ఓటీటీకి రావడం విశేషం. వానర జాతిలో తర్వాత తరం గురించి ప్రేక్షకులకు చెప్తూ 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'ను తెరకెక్కించారు. అంటే ఈ ఫ్రాంచైజ్‌లో ముందు తెరకెక్కించిన చిత్రాలకు ఇది ప్రీక్వెల్‌లాగా ఉంటుంది.



Also Read: 'రానా నాయుడు 2' నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ - స్పెషల్‌ వీడియోతో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌!