మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. మాలీవుడ్ మూవీ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీసుకు వచ్చింది. కుంచాకో బోబన్ (Kunchacko Boban), దిలీష్ పోతన్ (Dileesh Pothan) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఒరు దురూహ సాహచర్యత్తిల్' (Oru Durooha Saahacharyathil). ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? కథ ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో 'ఒరు దురూహ సాహచర్యత్తిల్' మే 13వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో 'ఒరు దురూహ సాహచర్యత్తిల్' సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. థియేటర్లలో ఏప్రిల్ 15న సినిమా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన విజయం లభించలేదు. దాంతో నాలుగు వారాల్లో ఓటీటీల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి మలయాళ వెర్షన్ మాత్రమే వీక్షకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. త్వరలో తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ డబ్బింగ్ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: Mouni Roy Divorce - డబ్బులు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?

Continues below advertisement

ఈ తరహా సినిమాలకు సాధారణంగా థియేటర్ల కంటే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ ఆదరణ లభిస్తుంటుంది. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోని ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎటువంటి వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి. 

సినిమా కథ ఏమిటి? అపరిచితుడు ఎవరు?సినిమా కథ - జోనర్ విషయానికి వస్తే... ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. సేతు (కుంచాకో బోబన్) మృదు స్వభావి. సాధు జంతువు లాంటి మనిషి. అతను ఓ హెల్త్ సెంటర్ ఉద్యోగి. ప్రశాంతంగా సాగిపోతున్న అతని జీవితంలోకి ఒక అపరిచితుడు వస్తాడు. అతని ఇంటిలో ప్రవేశిస్తాడు. ఆ అపరిచితుడి రాకతో సేతు జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. సేతు జీవితంలో వరుసగా కొన్ని రహస్యమైన సంఘటనలు జరుగుతాయి. వింత పరిస్థితులు ఎదురు అవుతాయి. అవి ఏమిటి? ఆ మిస్టరీ వెనుక ఎవరు ఉన్నారు? సేతు ఆ పరిస్థితుల నుండి ఎలా బయట పడ్డాడు? అనేది సినిమా కథలోని ప్రధానాంశం.

Also ReadNani Paradise - పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో

'ఒరు దురూహ సాహచర్యత్తిల్' రతీష్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. సజిన్ గోపు, చిదంబరం ఎస్. పోదువల్ ఇతర కీలక పాత్రలలో కనిపించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, ఉదయ పిక్చర్స్ సంస్థలపై  లిస్టిన్ స్టీఫెన్, కుంచాకో బోబన్ సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి.

Also ReadChiranjeevi Latest Photoshoot - బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్