బాలీవుడ్ సినిమాలు, పాపులర్ హిందీ సీరియల్ 'నాగిన్'తో పేరు తెచ్చుకున్న బెంగాలీ భామ మౌనీ రాయ్ (Mouni Roy). 'బ్రహ్మాస్త్ర'తో పాటు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకూ ఆమె పరిచయమే. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ (Sooraj Nambiar)కు విడాకులు ఇచ్చారు. నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ జంట వేరు పడింది. ఇప్పుడు మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ కలిసి జీవించడం లేదు. వేర్వేరుగా ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ ఫాలో కూడా చేసుకున్నారు. అయితే... ఈ విడాకులకు సంబంధించి అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Continues below advertisement

భర్త చేతిలో మోసపోయిన మౌనీ రాయ్అవును... మౌనీ రాయ్ (Mouni Roy Divorce News Latest Update)ను సూరజ్ నంబియార్ మోసం చేసినట్టు బాలీవుడ్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. ఏబీపీ న్యూస్ 'సాస్ బహు ఔర్ సాజిష్' షోకి అందించిన సమాచారం ప్రకారం... పేరు ప్రఖ్యాతలు, కీర్తి కోసం మౌని రాయ్‌ను ఆమె భర్త మోసం చేశాడట. మౌనీకి చెందిన డబ్బులు సైతం కొంత మొత్తాన్ని అతను కూడా వాడుకున్నాడట. డబ్బుతో పాటు కొన్ని విషయాల్లో సూరజ్ చేతిలో మోసపోయినట్టు తెలుసుకున్న మౌనీ రాయ్... అతడికి విడాకులు ఇచ్చినట్టు తెలిసింది.

సూరజ్ నంబియార్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కూడా మౌనీ రాయ్ తొలగించారు. ఏబీపీకి అందిన సమాచారం ప్రకారం... ప్రస్తుతం వారిద్దరూ కలిసి జీవించడం లేదు. విడాకులు కూడా మంజూరు అయ్యాయట. అయితే, ఈ అంశంపై వారిద్దరూ అధికారికంగా స్పందించలేదింకా.

Continues below advertisement

Also ReadNani Paradise - పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో

Mouni Roy Suraj Nambiar Wedding Date: మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ పెళ్లి జనవరి 27, 2022లో జరిగింది. సూరజ్ మలయాళీ అయితే... మౌనీ బెంగాలీ. తమ తమ సంప్రదాయాలను పాటిస్తూ గోవాలో వివాహం చేసుకున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... మౌని రాయ్ క్లోజ్ ఫ్రెండ్ దిశా పటాని కూడా సూరజ్ నంబియార్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు.

Photo GalleryChiranjeevi Latest Photoshoot - బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్

మౌనీ రాయ్ గురించి చెప్పాలంటే... హిందీ సీరియళ్లతో పాపులర్ అయ్యారు. ఆమె 2006లో ప్రసారమైన 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'తో కెరీర్‌ ప్రారంభించారు. అందులో కృష్ణ తులసి పాత్రను పోషించారు. ఆ తర్వాత 'కహో నా యార్ హై', 'కస్తూరి', 'దోవోన్ కే దేవ్...మహాదేవ్', 'నాగిన్' చేశారు. సినిమాల్లోనూ మౌనీ రాయ్ నటించారు.

విడుదలకు రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో మౌనీ రాయ్ ఐటెం సాంగ్ చేశారు. హిందీలో 'రన్', 'తుమ్ బిన్ 2', 'గోల్డ్', 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా', 'బ్రహ్మాస్త్ర', సినిమాల్లో నటించారు. జూన్ 5న విడుదల కానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'లో కూడా మౌనీ రాయ్ ఉన్నారు. 

Also ReadTrisha Krishnan - రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?