న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ది పారడైజ్' (The Paradise Movie). ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సినిమాలోని కీలక సన్నివేశాలు వచ్చిన తీరు పట్ల హీరో నాని అసంతృప్తి వ్యక్తం చేశారని, అందువల్ల రీషూట్లు చేస్తున్నారనేది సదరు పుకార్ల సారాంశం. ఆ ఊహాగానాలు నాని అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. అది చిత్ర బృందం దృష్టికి వెళ్లడంతో నిర్మాతలు ఘాటుగా స్పందించారు.
100 రోజులు షూట్ చేశాం... రీషూట్ లేదు!'ది ప్యారడైజ్' కోసం రీ షూట్ చేస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు అని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు 100 రోజులు షూట్ చేశామని, ఆ చిత్రీకరణ అంతా నిరంతరాయంగా సాగిందని, మిగిలిన చిత్రీకరణ కూడా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే కొనసాగుతోందని 'ది ప్యారడైజ్' చిత్ర బృందం స్పష్టం చేసింది.
Photo Gallery: Chiranjeevi Latest Photoshoot - బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
ఇప్పటి వరకు 'ది ప్యారడైజ్' కోసం ఒక్క సన్నివేశాన్ని కూడా రీ షూట్ చేయలేదని, భవిష్యత్తులో కూడా అటువంటి రీ షూట్లు చేసే ఆలోచన లేదని స్పష్టంగా 'ది ప్యారడైజ్' టీమ్ పేర్కొంది. పుకార్లకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
Also Read: Trisha Krishnan - రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?
విడుదల తేదీ మారలేదుThe Paradise Movie Release Date: 'ది ప్యారడైజ్' సినిమాను ఈ ఏడాది ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మరోసారి చిత్ర బృందం స్పష్టం చేసింది. నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా... రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Sai Pallavi Bollywood Debut Ek Din Result - సాయి పల్లవి సినిమా ఫ్లాపే... అంగీకరించిన హీరో
