బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ 'ధురందర్' (Dhurandhar Movie). ఇది అతి తక్కువ సమయంలో రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 800 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో 'ధురందర్' ఓటీటీ డీల్ (Dhurandhar OTT Deal)లో కూడా రికార్డు సృష్టించింది. రణవీర్ సింగ్ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొనుగోలు చేసింది. హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన హిందీ చిత్రంగా 'ధురందర్' రికార్డు క్రియేట్ చేసింది.
బాలీవుడ్ మూవీ క్రిటిక్ రవి చౌదరి తన సోషల్ మీడియా పోస్ట్‌లో... 'ధురందర్' ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 285 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని పేర్కొంది. దీంతో రణవీర్ సింగ్ సినిమా నెట్‌ఫ్లిక్స్ కొన్న అత్యంత ఖరీదైన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతే కాదు, ఈ డీల్‌తో 'పుష్ప 2' ఓటీటీ డీల్‌ను కూడా 'ధురందర్' అధిగమించింది.
'పుష్ప 2' కంటే 'ధురందర్'కు పది కోట్లు ఎక్కువఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'పుష్ప 2' సినిమా 2024లో విడుదల అయ్యింది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 275 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే 'ధురందర్' కంటే పది కోట్లు తక్కువ. రణవీర్ సింగ్ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ 'పుష్ప 2' కంటే 10 కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లించింది. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. 'ధురందర్' ఓటీటీ డీల్ గురించి రవి చౌదరి 'ఎక్స్' (ట్విట్టర్)లో ఇలా రాశారు - ''ఇది స్పష్టంగా 'ధురందర్' డిమాండ్, ప్రమోషన్, గ్లోబల్ అప్పీల్‌ను చూపుతుంది. థియేటర్లలో పూర్తిగా విడుదల కాక ముందే నెట్‌ఫ్లిక్స్ సినిమాపై కాన్ఫిడెన్స్ చూపించింది''
ఓటీటీలో 'ధురందర్' రిలీజ్ అయ్యేది ఎప్పుడు?Dhurandhar ott release date: డిసెంబర్ 5న థియేటర్లలో 'ధురందర్' విడుదలైంది. హిందీ సినిమా ఏది అయినా థియేటర్‌లలో విడుదలైన 6 నుండి 8 వారాల తర్వాతే ఓటీటీలో వస్తుంది. కాబట్టి, 'ధురందర్' కూడా జనవరి 2026 చివరిలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రావచ్చు. జనవరి 16 నుండి 30, 2026 మధ్య ఓటీటీలో విడుదల కావచ్చు.