Om Bheem Bush OTT release date on Amazon Prime: శ్రీ విష్ణు హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' (Om Bheem Bush Movie). ఆయనతో పాటు ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్స్. నో లాజిక్, ఓన్లీ మేజిక్... అనేది సినిమా క్యాప్షన్. మార్చి 22న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల్ని నవ్వించి మంచి విజయం అందుకుంది. మరి, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుందో తెలుసా?


ఏప్రిల్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో...
Om Bheem Bush OTT Platform: 'ఓం భీమ్ బుష్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నెల 12 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.






ఏప్రిల్ 12న తెలుగు సినిమా ఓటీటీ ప్రేమికులకు పండగ అని చెప్పాలి. మలయాళ బ్లాక్ బస్టర్, ఏపీ & తెలంగాణలో మంచి విజయం సాధించిన 'ప్రేమలు' తెలుగు వెర్షన్ ఆహాలో, మలయాళం & తమిళ్ వెర్షన్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. విశ్వక్ సేన్ 'గామి' జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మూడు డిఫరెంట్ జానర్ సినిమాలు కావడంతో ఏ జానర్ ఆడియన్స్ ఆ మూవీ చూడవచ్చు.


Also Read: 'పుష్పరాజ్'కు ముందు అల్లు అర్జున్ టాప్ ఫైవ్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లు - ఈ సినిమాలే ఎందుకంత స్పెషలో తెలుసుకోండి


'హుషారు', 'రౌడీ బాయ్స్' తర్వాత శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన సినిమా 'ఓం భీమ్ బుష్'. విమర్శకుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు వచ్చాయి. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు పడి పడి నవ్వారు. మరి, ఓటీటీలో విడుదలైన తర్వాత ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.



'ఓం భీమ్ బుష్' సినిమా కథ ఏమిటంటే?
Om Bheem Bush Movie Story: చిన్ననాటి నుంచి స్నేహితులైన క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ) పీహెచ్‌డీ చేయడానికి కాలేజీలో చేరతారు. అక్కడ ప్రిన్సిపాల్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్)ను టార్చర్ చేస్తూ ఐదేళ్లుగా అక్కడ ఉంటారు. చివరకు, వాళ్లను కాలేజీ నుంచి బయటకు పంపిస్తాడు రంజిత్. ఊరు వెళుతూ వెళుతూ మధ్యలో భైరవపురంలో ఆగుతారు. ఆ ఊరి చివర మహల్‌లో సంపంగి దెయ్యాన్ని పట్టుకోవడానికి ఆ ముగ్గురూ ఎందుకు వెళ్లారు? ఆ ఊరిలో అసలు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?



'ఓం భీమ్ బుష్'లో శ్రీ విష్ణు సరసన ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) నటించారు. ప్రియదర్శి పులికొండ జోడీగా బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఖాన్ కనిపించారు. 'హుషారు' ఫేమ్ ప్రియా వడ్లమాని ప్రత్యేక గీతంలో సందడి చేశారు. అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది.