Aditi Rao Hydari: అదితితో నెట్‌ఫిక్స్ కొత్త వెబ్ సిరీస్... ఇద్దరు హీరోలు, పెద్ద దర్శకుడు - డీటెయిల్స్ తెల్సా?

O Saathi Re on Netflix: హైదరాబాద్ అమ్మాయి, హీరోయిన్ అదితి రావు హైదరి మరో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయ్యారు. అందులో ఇద్దరు హీరోలున్నారు. వాళ్ళు ఎవరు? దర్శకుడు ఎవరు? వంటి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

Netflix Original Series 2025: ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫిక్స్ మరో హిందీ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. ఇందులో హైదరాబాద్ అమ్మాయి, హీరోయిన్ అదితి రావు హైదరి మెయిన్ లీడ్. మరి హీరోలు ఎవరు? దర్శకత్వం వహించేది ఎవరు? దీని వెనక ఎవరు ఉన్నారు? వంటి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

ఓ సాథియా రే... ఇంతియాజ్ అలీ సిరీస్!
బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన 'తమాషా', 'రాక్ స్టార్' సినిమాలకు తెలుగులోనూ కొంత మంది అభిమానులు ఉన్నారు. షాహిద్ కపూర్ - కరీనా కపూర్ జంటగా తీసిన 'జబ్ వుయ్ మెట్', సైఫ్ అలీ ఖాన్ - దీపికా పదుకోన్ జంటగా నటించిన 'లవ్ ఆజ్ కల్' (తెలుగులో 'తీన్ మార్'గా పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు) సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నేతృత్వంలో 'ఓ సాథియా రే' వెబ్ సిరీస్ రూపొందుతోంది. 

'అమర్ సింగ్ చమ్కీలా' వెబ్ సిరీస్ గుర్తు ఉందా? నెట్‌ఫిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ హిట్ సిరీస్ వెనక ఉన్నది కూడా ఇంతియాజ్ అలీనే. ఇప్పుడు మరోసారి నెట్‌ఫిక్స్, అలీ కలయికలో మరో సిరీస్ వస్తోంది. 

ఇద్దరు హీరోలు... వాళ్ళు ఎవరు? కథేమిటి?
'ఓ సాథియా రే'లో అశ్విని తివారి, అర్జున్ రాంపాల్ హీరోలుగా నటిస్తున్నారు.‌ ఆరిఫ్ ఆలీ దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందుతోంది. దీనికి క్రియేటర్, రైటర్, షో రన్నర్ ఇంతియాజ్ అలీ. ఈ తరంలో అలనాటి ప్రేమకు గుర్తుగా ఈ సిరీస్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 'ఓ సాథియా రే' మోడ్రన్ స్టోరీతో తెరకెక్కుతోందని ఇంతియాజ్ అలీ తెలిపారు అయితే ఇందులో లవ్ మాత్రం వింటేజ్ ఫీలింగ్ ఇస్తుందని చెప్పారు.

Also Readనెక్ట్స్ టార్గెట్ శ్రీ రెడ్డి... పోసాని అరెస్టుతో సంకేతాలు వెళ్లాయా? బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?

అదితి రావు హైదరికి నాలుగో వెబ్ సిరీస్!
తెలుగులో 'సమ్మోహనం', 'మహా సముద్రం' వంటి సినిమాలలో నటించిన అదితి రావు హైదరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న నాలుగో వెబ్ సిరీస్ 'ఓ సాథియా రే'. ఇంతకు ముందు 'తాజ్: డివైడెడ్ బై బ్లడ్', 'జూబ్లీ', 'హీరమండీ' చేశారు. 'మహా సముద్రం' తర్వాత తెలుగులో ఆవిడ మరొక సినిమా చేయలేదు. ప్రస్తుతం ఆవిడ చేతిలో ఒక ఇంగ్లీష్ సినిమా 'లయన్ నెస్', సైలెంట్ సినిమా 'గాంధీ టాక్స్' ఉన్నాయి. సిద్ధార్థ్‌తో పెళ్లి తర్వాత ఆవిడ యాక్సెప్ట్ చేసిన సిరీస్ ఇదేనని చెప్పవచ్చు. 

Also Read'శబ్దం' ట్విట్టర్ రివ్యూ: రీ రికార్డింగ్‌తో భయపెట్టిన తమన్... ఆయనే అసలు హీరో - ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్‌ టాక్ ఎలా ఉందంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola