Extra Ordinary Man OTT Release Date: యూత్ స్టార్ నితిన్, యంగ్ సెన్సేషన్ శ్రీలీలా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం డిసెంబర్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైయింది. దర్శక హీరోలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని ప్లాప్ గా మిగిలిపోయింది. అయితే థియేటర్లలో రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది.
'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఓటీటీ సంస్థ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. కాకపోతే ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకొస్తారనేది వెల్లడించలేదు. అయితే సంక్రాంతి కానుకగా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని అంటున్నారు.
‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, సంపత్ రాజా, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిత్య మూవీస్ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. హరీష్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. ఆర్థర్ ఏ. విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేసారు.
Also Read: డెబ్యూతోనే సత్తా చాటిన టాలీవుడ్ డైరెక్టర్స్!
నిజానికి గత కొన్నాళ్లుగా ప్లాపుల్లో ఉన్న హీరో నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ.. ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో హిట్టు కొట్టాలని బాగా కష్టపడ్డారు. దీనికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచిరెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాకు బజ్ తెచ్చిపెట్టాయి. అయితే సరైన టైంలో విడుదల చేయకపోవడం, మౌత్ టాక్ బలహీనంగా ఉండటం, 'హాయ్ నాన్న' సినిమాతో పోటీ వంటివి ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఫలితంగా నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. మరి థియేటర్లలో అంతగా ప్రభావం చూపించలేకయిన ఈ చిత్రం డిజిటల్ వేదికపై ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.
‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ కథేంటంటే..?
అభినయ్ (నితిన్) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్. తనకెంతో ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు, గౌరవం దక్కదు. సాదాసీదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి లిఖిత (శ్రీలీల) ప్రవేశిస్తుంది. ధవనవంతురాలైన ఆమెతో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆమె కంపెనీలో ఐదంకెల జీతానికి ఉద్యోగంలో చేరిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కొత్త దర్శకుడు అభి దగ్గరకొచ్చి ఒక కథ చెప్పి, తనని హీరోగా పెట్టి సినిమా తీస్తానంటాడు. దాంతో అతనిలో మళ్లీ సినీ ఆశలు చిగురిస్తాయి. అయితే ఆ కథ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కోటియా గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్నది.
రావణుడిలాంటి నీరో అలియాస్ నిరంజన్ (సుదేవ్ నాయర్) అనే రియల్ విలన్ ఆటకట్టించడానికి సైతాన్ అనే పోలీస్ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఆ కథలో కీలకాంశం. తొలుత ఆ సినిమా చేయకూడదనుకున్నా, కథ నచ్చడంతో ఆ తర్వాత మనసు మార్చుకుంటాడు అభి. సినిమా కోసం ఉద్యోగాన్ని, ప్రేమించిన అమ్మాయిని వదులుకొని కష్టపడతాడు. కానీ, తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి దర్శకుడు అతన్ని కాదని మరో హీరోతో ఆ చిత్రం పట్టాలెక్కించాలని నిర్ణయించుకుంటాడు. అయినప్పటికీ ఆ స్క్రిప్టులో ఉన్న విధంగా చేసుకుంటూ వెళ్లిన అభికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? విలన్ కి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడు? ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా ఎలా పేరు తెచ్చుకున్నాడు? అనేదే మిగతా కథ.
Also Read: 'లాల్ సలామ్' రిలీజ్ డేట్ ఫిక్స్.. సూపర్ స్టార్ సినిమా ఎప్పుడంటే?