OTT Releases This Week: ఈసారి సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరో కూడా పోటీకి దిగుతున్నాడు. 2024 సంక్రాంతికి థియేటర్లలో ఏకంగా నాలుగు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా భారీగా సినిమా సందడి జరగనుంది. సంక్రాంతి వీక్‌లో ఏకంగా 29 చిత్రాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. ఇతర ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌తో పోలిస్తే.. ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్‌లు ఎక్కువ ఉన్నాయి. సినిమాలు సిరీస్‌లు అన్నీ కలిపి ఏకంగా 17 రిలీజ్‌లు ఉన్నాయి.


నెట్ ఫ్లిక్స్‌లో



  • జనవరి 8న ‘ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా’ అనే ఇండోనేషియన్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

  • జనవరి 9న ‘పీట్ డేవిడ్‌సన్ - టర్బో ఫంజరెల్లి’ అనే ఇంగ్లీష్ మూవీతో పాటు ‘డైరీస్ సీజన్ 2 పార్ట్ 2’ ఇటాలియన్ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది.

  • జనవరి 10న ‘బ్రేక్ పాయింట్ సీజన్ 2’, ‘ద ట్రస్ట్ - ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్’లాంటి ఇంగ్లీష్ సిరీస్‌తో పాటు ‘కింగ్‌డమ్ 3 - ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్’ అనే జపనీస్ మూవీ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది.

  • 11న ‘బాయ్ స్వాలోస్ యూనివర్స్’, ‘సోనిక్ ప్రైమ్ సీజన్ 3’, ‘ఛాంపియన్’లాంటి ఇంగ్లీష్ సిరీస్‌లు, ‘డిటెక్టివ్ ఫోస్ట్’ అనే పోలిష్ సిరీస్,‘కిల్లర్ సూప్’ అనే హిందీ సిరీస్‌తో పాటు ‘మంత్ర సురుగణ’ అనే ఇండోనేషియన్ చిత్రం స్ట్రీిమింగ్ కానున్నాయి. 

  • జనవరి 12న ‘అడిరే’, ‘లిఫ్ట్’, ‘డంబ్ మనీ’ వంటి ఇంగ్లీష్ సినిమాలతో పాటు ‘లవ్ ఈజ్ బ్లైండ్ - స్వీడన్’ అనే స్వీడిష్ సిరీస్ కూడా విడుదల కానుంది.

  • నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మ్యాన్’ కూడా జనవరి 12 నుండే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది.



అమేజాన్ ప్రైమ్‌లో


ఇక అమేజాన్ ప్రైమ్‌లో మూడు రిలీజ్‌లు ఉన్నాయి. జనవరి 11న ‘90 హరి మెంకారి సువామి’ అనే ఇండోనేషియన్ సినిమాతో పాటు ‘మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1’లాంటి ఇంగ్లీష్ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమ్ కానున్నాయి. ఇక ‘రోల్ ప్లే’ అనే ఇంగ్లీష్ మూవీ జనవరి 12 నుండి స్ట్రీమ్ కానుంది. జీ5లో ‘అజయ్ గాడు’ అనే తెలుగు మూవీ జనవరి 12 నుండి స్ట్రీమ్ కానుంది. ఆహాలో ‘కోట బొమ్మాళి’ మూవీ జనవరి 11 నుండి స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. ‘సేవప్పి’ అనే తమిళ మూవీ ఆహా తమిళంలో జనవరి 12 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక జియో సినిమాలో ‘ల బ్రియా’ అనే సిరీస్ జనవరి 10న స్ట్రీమింగ్‌కు సిద్ధం కాగా.. ‘టెడ్’ అనే వెబ్ సిరీస్ జనవరి 12 నుండి స్ట్రీమ్ కానుంది.



డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘ఎకో’ అనే వెబ్ సిరీస్ జనవరి 11 నుండి స్ట్రీమ్ కానుంది. ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ అనే మరో యానిమేషన్ సిరీస్ కూడా జనవరి 12న హాట్‌స్టార్‌లో విడుదల అవ్వనుంది. సోనీ లివ్‌లో జనవరి 10న ‘జియో సినిమా లా బ్రియా సీజన్ 3’, ‘ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్’ అనే రెండు ఇంగ్లీష్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. జనవరి 12న ‘చేరన్స్ జర్నీ’, ‘టెడ్’ సిరీస్‌లు స్ట్రీమ్ కానున్నాయి.


Also Read: ఏం ఉపయోగం దానివల్ల? హిందీ భాషపై విలేఖరి ప్రశ్న - విజయ్ సేతుపతి ఘాటు రిప్లై