Nithiin's Robinhood OTT Platform Confirmed: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin), దర్శకుడు వెంకీ కుడుముల కాంబో లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' (Robinhood). యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు.
ఓటీటీ డీల్ ఫిక్స్..!
'రాబిన్ హుడ్' మూవీ డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ హక్కుల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'జీ5' సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే, శాటిలైట్ హక్కులను 'జీ తెలుగు' ఛానల్ సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. 'భీష్మ' మూవీ తర్వాత వెంకీ, నితిన్ కాంబోలో వస్తోన్న 'రాబిన్ హుడ్'పై భారీ అంచనాలు నెలకొనగా.. భారీ ధరకే ఓటీటీ, శాటిలైట్ డీల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!
ట్రైలర్ అదుర్స్
'రాబిన్ హుడ్' నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, లుక్స్, ట్రైలర్ అదిరిపోయాయి. ఈ మూవీలో నితిన్ ఓ ప్రొఫెషనల్ దొంగగా కనిపించనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డుగా పని చేస్తూనే డిఫరెంట్ వేషాలు వేస్తూ.. సైబర్ టెక్నిక్స్ ఉపయోగించి దొంగతనాలు చేస్తుంటాడని అర్థమవుతోంది. 'నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్' అంటూ నితిన్ చెప్పే డైలాగ్ గూస్ బంప్ల్ తెప్పిస్తోంది.
ఈవెంట్‌లో డ్యాన్స్‌తో వార్నర్ మెరుపులు
ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ఆయన.. తన తొలి టాలీవుడ్ ప్రీ రిలీజ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. 'పుష్ప 2' సినిమాలోని 'చూపే బంగారమాయనే శ్రీవల్లీ..' పాటకు బన్నీ హుక్ స్టెప్ వేసి తనదైన శైలిలో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు సైతం ఆయన సోషల్ మీడియాలో 'పుష్ప' మేనరిజమ్స్‌తో సందడి చేసిన విషయం తెలిసిందే.
అలాగే.. ఈ మూవీలో యంగ్ హీరోయిన్ కేతికాశర్మ ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన 'అదిదా సర్ ప్రైజ్' సాంగ్ హుక్ స్టెప్స్ కూడా వైరల్‌గా మారగా.. స్టేజీపై నితిన్, శ్రీలీల, కేతికా శర్మ, డేవిడ్ వార్నర్ సైతం ఆ పాటకు మరోసారి డ్యాన్స్ చేశారు. దీంతో ఈ సీన్ ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచింది.