NTR: జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!

Devara Japan Release: ఎన్టీఆర్ జపాన్‌లో సందడి చేస్తున్నారు. జపనీస్‌లో దేవర రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమానితో డ్యాన్స్ చేశారు.

Continues below advertisement

NTR Dance With Fan In Japan Devara Release: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'దేవర' (Devara) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే జోష్‌తో జపాన్‌లోనూ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. అక్కడి అభిమానులతో ఆయన సందడి చేశారు. 

Continues below advertisement

అభిమానితో డ్యాన్స్

జపాన్‍‌లో ఓ అభిమానితో కలిసి ఎన్టీఆర్ స్టెప్పులేశారు. సినిమాలోని 'ఆయుధ పూజ' పాటకు డ్యాన్స్ చేస్తూ వారిలో జోష్ నింపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ప్రీమియర్ షో సోమవారం ప్రదర్శించారు. ఈ నెల 28న జపనీస్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దర్శకుడు కొరటాల శివ సైతం ఎన్టీఆర్‌తో పాటు అక్కడకు వెళ్లారు. ఇప్పటికే జపాన్ మీడియాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు.

Also Read: రూ.50 కోట్ల క్లబ్‌లో 'కోర్ట్' మూవీ - 10 రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు.. ఆడియన్స్ హిస్టారికల్ తీర్పు అంటూ..

ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదంతే..

దర్శకధీరుడు రాజమౌళి 'RRR' తర్వాత జపాన్‌లో రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ రెండో సినిమా 'దేవర' (Devara). ఈ క్రమంలోనే అక్కడ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కటౌట్‌కు పువ్వులతో పూజలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లను సైతం మూవీ టీం భారీగానే ప్లాన్ చేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. 'పుష్ప', 'కల్కి 2898 ఏడీ' బాటలోనే 'దేవర'ను సైతం జపాన్‌లో రిలీజ్ చేస్తున్నారు. 'కల్కి' సినిమాను రిలీజ్ చేసిన ట్విన్ డిస్ట్రిబ్యూటర్స్ 'దేవర'ను సైతం జపాన్‌లో రిలీజ్ చేస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva), ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'దేవర' ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో గతేడాది సెప్టెంబర్ 27న రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మూవీలో రెండు డిఫరెంట్ రోల్స్‌లో ఎన్టీఆర్ కనిపించారు. తండ్రి దేవర, కొడుకు వరదగా రెండు పాత్రల్లో నటించగా.. ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. విలన్‌గా నటించిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేశారు. ప్రకాష్‌రాజ్, శృతి మరాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

ఓటీటీలోనూ అదరగొడుతోంది..

మరోవైపు, ఓటీటీలోనూ దేవర అదరగొడుతోంది. గతేడాది నవంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది. నాన్ ఇంగ్లీష్ మూవీ కేటగిరీలో వరల్డ్ వైడ్‌గా అత్యధిక వ్యూస్ కొల్లగొట్టిన నాలుగో మూవీగా 'దేవర' రికార్డు క్రియేట్ చేసింది.

Continues below advertisement