Jiiva's Aghathiyaa Movie OTT Release On SunNXT: నటుడు జీవా (Jiiva), రాశీ ఖన్నా (Raashii Khanna) లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ 'అగత్యా' (Aghathiyaa). ఫిబ్రవరి 28న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.


ఆ ఓటీటీలో స్ట్రీమింగ్..


తాజాగా.. 'అగత్యా' ఓటీటీ రిలీజ్ డేట్‌ను టీం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నెల 28 నుంచి ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. ఈ చిత్రానికి పా.విజయ్ దర్శకత్వం వహించగా.. అర్జున్, ఎడ్వెర్డ్ సోన్నెన్‌బ్లిక్, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు.






Also Read: జాగ్రత్త.. 'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుడి శాపమే! - నటుడు రఘుబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. భయపెట్టేస్తున్నారా..?


'అగత్యా' స్టోరీ ఏంటంటే..?


'అగత్యా' ఆర్ట్ డైరెక్టర్‌గా తనని తాను నిరూపించుకోవాలని ఎన్నో కలలు కంటాడు. ఈ క్రమంలోనే పెద్ద సినిమాలో చేసే ఛాన్స్ వస్తుంది. అయితే, అనుకోని కారణాల వల్ల అతని ఫస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. దీంతో తన స్నేహితురాలు వీణ (రాశీఖన్నా) ఇచ్చిన సలహాతో సినిమా కోసం తాను వేసిన సెట్‌ను ఓ భూత్ బంగ్లాలా మార్చాలనుకుంటాడు. అయితే, నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని తెలుసుకుంటాడు. బంగ్లాలో దెయ్యాలు ఉండేందుకు కారణాలేంటి..?


ఈ క్రమంలోనే అగత్యా ఎదుర్కొన్న సవాళ్లేంటి..?, 1940లో అక్కడ నివసించిన సిద్ధార్థ్ (అర్జున్) గురించి తెలుసుకున్న అగత్యా.. అసలేం చేశాడు..? బ్రిటిష్ గవర్నర్ ఎడ్విన్ డూప్లెక్స్ చేసిన అరాచకం ఏంటి.?, క్యాన్సర్‌తో బాధ పడుతున్న తల్లిని రక్షించుకునేందుకు అగత్యా ఏం చేశాడు.?  అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.2.15 కోట్లు మాత్రమే రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు.


రంగం సినిమాతో..


రంగం, యాత్ర 2 సినిమాలతో నటుడు జీవా తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా యాత్ర 2లో వైఎస్ జగన్‌గా నటించి ఆయన మేనరిజంతో మెప్పించారు. గతేడాది తమిళంలో నటించిన బ్లాక్.. తెలుగులో ఇప్పుడు 'డార్క్'గా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ తనదైన శైలితో దూసుకెళ్తున్నారు జీవా. తాజాగా, హారర్ జోనర్లలో మూవీస్‌ను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.