Netflix documentry on Kumari aunty: సోష‌ల్ మీడియా ఎప్పుడు.. ఎవ‌రిని ఫేమ‌స్ చేస్తుందో తెలీదు. రాత్రికి రాత్రికి స్టార్ అయిన‌వాళ్లు ఉన్నారు. అలా రోడ్ సైడ్ మీల్స్ అమ్మే ఆంటీ కుమారీ ఆంటీ కూడా అలానే ఫేమ‌స్ అయిపోయారు. ఆమె ఫుడ్ రుచో లేదా ఆమె ప‌ల‌క‌రింపో తెలీదు కానీ.. ఆమె ద‌గ్గ‌రికి జ‌నాలు తండోప‌తండాలుగా రావ‌డం మొద‌లుపెట్టారు. అలా మాదాపూర్ లో ఫుడ్ స్టాల్ న‌డిపే ఒక ఆంటీ ఇప్పుడు సెల‌బ్రిటీ అయ్యారు. ఎంత‌లా అంటే ఆమె విష‌యంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం స్పందించే అంత ఫేమ‌స్ అయ్యారు. తానే స్వ‌యంగా వ‌చ్చి కుమారీ ఆంటీ ఫుడ్ తింటాను అని రేవంత్ రెడ్డి చెప్పారు.  


నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంట‌రీ? నిజ‌మెంత‌?


ఇదిలా ఉంటే కుమారీ ఆంటీకి సంబంధించి ఒక వార్త వైర‌ల్ అవుతోంది. ఆమెపై డాక్యుమెంట‌రీ షూట్ చేస్తున్నార‌ని, అదికూడా మూడు ఎపిసోడ్లుగా నెట్ ఫ్లిక్స్ లో వ‌స్తుంద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించి ఒక పోస్ట‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఫేమ్ అనే పేరుతో ఆమెపై డాక్యుమెంట్రీ తీస్తున్నార‌ని, ఇప్ప‌టికే బీబీసీ కూడా ఆమెను స్పందించింద‌ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. . అయితే, దీనిపై మాత్రం ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇక కొంత‌మందైతే.. సెటైరికల్‌గా కూడా ఈ ప్రచారం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇప్పుడు దాంట్లో నిజ‌మెంతో అదే వాద‌న‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. 


టెస్టీ ఫుడ్‌.. ఆమె సక్సెస్‌ సీక్రెట్‌


ఐటీసీ కోహినూరు దగ్గర్లో ఉన్న సాయికుమారి ఆంటీ మీల్స్‌ పాయింట్‌ ఎప్పటి నుంచో చాలా ఫేమస్‌. కారణం ఆమె అందించే టేస్టీ ఫుడ్‌. ఆమె నవ్వుతూ పలకరించే తీరు. నిజానికి సాయికుమారి ఆంటీ ఫుడ్‌కి ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. ప్రముఖ య్యూట్యూబర్‌, యాంకర్‌ శివజ్యోతి ఒక వీడియో చేయడంతో ఆమె ఇంకా ఇంకా ఫేమస్‌ అయ్యారు. ఆ తర్వాత ప్రతి య్యూట్యూబ్‌ ఛానెల్‌వాళ్లు ఆమెతో వీడియోలు చేయడంతో సాయికుమారి ఆంటీ సోషల్‌మీడియా స్టార్‌ అయ్యారు. అలా ఆమె ఫుడ్ గురించి తెలుసుకున్న వాళ్లంతా భారీగా రావ‌డంతో కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ద‌గ్గ‌ర ట్రాఫిక్ జామ్ అవ్వ‌డం లాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ తీసేయ‌మ‌న‌డంతో తెలంగాణ సీఎం రేవంత్ జోక్యం చేసుకుని, ఆమె ఫుడ్ స్టాల్ కంటిన్యూ చేయించారు. తానే స్వ‌యంగా వ‌చ్చి తింటాన‌ని అన్నారు. 


ఇక ప్రతి రోజు 100 కేజీల చికెన్‌, దాదాపు 10 కిలోల మటన్‌, బోటీ, తలకాయ కూర వండుతారు సాయికుమారి ఆంటీ. అది మొత్తం కేవలం 2 గంటల్లోనే ఖాళీ అయిపోతుంది అంటే.. ఆమె క్రేజ్‌ ఏంటో ఆలోచించొచ్చు. ఆమె ఫుడ్‌ టేస్ట్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమెపై ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. ఆమె వ‌ల్ల త‌మ వ్యాపారం దెబ్బ‌తింటోంద‌ని, పోలీసులు వ‌చ్చి ఇబ్బందులు పెడుతున్నారంటూ ఇంకొంత‌మంది ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కుమారి ఆంటీ క్రేజ్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతోంది అంటున్నారు ఆంటీ ఫ్యాన్స్.


Also Read: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే, చేతిలో గాజు గ్లాసు చూశారా - రిలీజ్ డేట్‌తో ఓజీ కొత్త పోస్టర్