My Perfect Husband Trailer: ‘మై పర్ఫెక్ట్ హస్బెండ్’ ట్రైలర్ - తండ్రి ప్రియురాలి కూతురిని ప్రేమించే కొడుకు - ఈ కష్టం ఏ భర్తకూ రాకూడదు!

My Perfect Husband Trailer: ఇప్పటివరకు ఎక్కువశాతం సీరియస్ రోల్స్‌లోనే ప్రేక్షకులను అలరించిన ‘బాహుబలి’ సత్యరాజ్. మొదటిసారి ఒక పర్ఫెక్ట్ హస్బెండ్‌గా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు.

Continues below advertisement

My Perfect Husband Trailer Is Out Now: ఫ్యామిలీ డ్రామా ప్లస్ కామెడీ.. ఇది చాలామందికి ఇష్టమైన కాంబినేషన్. అందుకే ఓటీటీలో ఎక్కువగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరొక కొత్త వెబ్ సిరీస్ యాడ్ అవ్వనుంది. అదే ‘మై పర్ఫెక్ట్ హస్బెండ్’.  సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్న ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. తాజాగా ఒక భర్త పాత్రలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు సత్యరాజ్. ట్రైలర్‌తోనే చాలామందిని ఇంప్రెస్ చేసేశారు కూడా.

Continues below advertisement

పర్ఫెక్ట్ హస్బెండ్ కథ..

‘‘తోటలు, పొలాలు.. ఇవేవి చూసి నేను గర్వపడను. వెయ్యిమంది ఆడవాళ్ల మధ్య మీరు వర్క్ చేసినా కూడా ఎవరినీ మీరు కన్నెత్తి చూడకుండా నాకోసమే నాకంటూ బ్రతుకుతున్న మనిషిగా మిమ్మల్ని చూసి గర్వపడతాను’’ అంటూ సీనియర్ నటి సీత చెప్పే డైలాగ్‌తో ‘మై పర్ఫెక్ట్ హస్బెండ్’ ట్రైలర్ మొదలవుతుంది. సత్యరాజ్, సీత ఒక పర్ఫెక్ట్ కపుల్ అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ‘‘ఒక ఇమేజ్‌ను ఏర్పరచుకోవడం చాలా కష్టం’’ అంటూ తన దాంపత్య జీవితంలోని కష్టాలను షేర్ చేసుకుంటారు సత్యరాజ్. కానీ అంతలోనే ఏదో జరగడం వల్ల సత్యరాజ్ గురించి అందరూ చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ‘‘నేరుగా ఆంటీ దగ్గరకు వెళ్లి మొత్తం నిజం చెప్పేయండి’’ అంటూ సత్యరాజ్‌కు సలహా ఇస్తాడు తన స్నేహితుడు.

నమ్మలేని నిజం..

ఆ నిజం ఏంటో తన భార్యకు చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నిస్తారు సత్యరాజ్. అది విన్న తర్వాత సీత.. ‘‘ఒక అబద్ధాన్ని ఒక మనిషి జీవితకాలం చెప్తూ ఉంటారా’’ అని ఆశ్చర్యపోతారు. అప్పుడే కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. స్కూల్ రోజుల్లో సత్యరాజ్‌కు ఒక ప్రేమకథ ఉంటుంది. ఆ ప్రేమకథను తన భార్యకు చెప్పడం మొదలుపెడతారు. ఇక ప్రజెంట్‌కు వచ్చేస్తే.. సత్యరాజ్ కొడుకు ఆర్జే రక్షన్‌కు వర్ష బొల్లామాతో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. తీరా చూస్తే.. వర్షా తల్లి రేఖ (భారతి)నే సత్యరాజ్ స్కూల్‌లో ప్రేమించిన అమ్మాయి అని తెలుస్తుంది. అలా ‘మై పర్ఫెక్ట్ హస్బెండ్’లోని అతిపెద్ద ట్విస్ట్‌ను ట్రైలర్‌లోనే రివీల్ చేశారు మేకర్స్.

సీనియర్ నటీనటులు..

నిజం బయటపడడంతో సత్యరాజ్ కొడుకుకు, రేఖ కూతురికి పెళ్లి చేయడం వారిద్దరికీ నచ్చదు. కానీ అప్పటికే రక్షన్, వర్షా ప్రేమలో ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ‘మై పర్ఫెక్ట్ హస్బెండ్’ వెబ్ సిరీస్ విడుదలయిన తర్వాత చూసి తెలుసుకోవాల్సిందే. ఈ కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన వెబ్ సిరీస్ ఆగస్ట్ 16న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. సత్యరాజ్, సీత, రేఖ లాంటి సీనియర్ నటీనటులు ఈ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్స్ చేయడం విశేషం. ఇప్పటికే పలు ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్‌లు హాట్‌స్టార్‌లో విడుదలయ్యి సబ్‌స్క్రైబర్లను అలరించగా.. ‘మై పర్ఫెక్ట్ హస్బెండ్’ కూడా అందులో యాడ్ అవ్వనుంది.

Also Read: 'కమిటీ కుర్రోళ్ళు' చూస్తా... సూపర్ స్టార్ మహేష్ ట్వీట్ - నిహారిక గురించి ఏం చెప్పారంటే?

Continues below advertisement