Munjya OTT Release Date: కొన్నిరోజులుగా ఓటీటీల్లో సినిమాల సందడి కాస్త తగ్గింది. తాజాగా మళ్లీ కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా చాలావరకు కొత్త నటీనటులతో తెరకెక్కిన బాలీవుడ్ హారర్ మూవీ ‘ముంజ్య’ కూడా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. థియేటర్లలో విడుదలయిన తర్వాత కలెక్షన్స్ విషయంలో ఓ రేంజ్‌లో దూసుకుపోయింది ఈ మూవీ. జూన్ 7న ‘ముంజ్య’.. థియేటర్లలో సందడి చేసింది. విడుదలయ్యి నెలరోజులు అవ్వడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. దీన్ని బట్టి చూస్తే ‘ముంజ్య’ను ఓటీటీలో చూడాలంటే ఇంకా కొన్నిరోజులు ఆగాలని తెలుస్తోంది.


ఓటీటీ పార్ట్‌నర్..


ఒకప్పుడు ఓటీటీల్లో హిందీ సినిమాలు కూడా చాలా త్వరగా స్ట్రీమింగ్ ప్రారంభించుకునేవి. దీంతో సినీ నిర్మాతలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. థియేటర్లలో విడుదలయిన దాదాపు రెండు నెలల వరకు ఓటీటీల్లో సినిమాలు స్ట్రీమ్ అవ్వకూడదని అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో థియేటర్లలో మంచి టాక్ అందుకున్న మూవీ ఏదైనా.. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలరోజులోపే ఓటీటీలో స్ట్రీమ్ అవ్వదు. ఆ విధంగా చూస్తే.. ‘ముంజ్య’కు థియేటర్లలో సూపర్ హిట్ టాక్ లభించింది. అందుకే ఇప్పట్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఏది అనే విషయం బయటికొచ్చినా.. రిలీజ్ డేట్ గురించి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు.


లేట్ అవ్వొచ్చు..


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. ‘ముంజ్య’ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. జూన 7న ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది కాబట్టి ఈ విడుదల తేదీ నుంచి సరిగ్గా రెండు నెలల తర్వాత ‘ముంజ్య’.. ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది లేదా అంతకంటే కాస్త లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో థియేటర్లలో మిస్ అయ్యి.. ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకునేవారు ఇంకా కొన్నిరోజులు ఆగక తప్పదు. గత కొన్నేళ్లలో బాలీవుడ్‌లో హారర్ కామెడీ చిత్రాలకు క్రేజ్ పెరిగింది. ‘ముంజ్య’ కూడా అదే రూట్‌ను ఫాలో అయ్యి హిట్‌ను సాధించింది. కలెక్షన్స్ విషయంలో కూడా వావ్ అనిపించింది.


మొదటి సినిమాతోనే..


ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్కు పైగా కలెక్షన్స్‌ను సాధించింది ‘ముంజ్య’. ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాను హిట్ చేశారు ప్రేక్షకులు. ముందుగా ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేకపోయినా మౌత్ టాక్ బాగుండడంతో హారర్ కామెడీ జోనర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు అధిక సంఖ్యలో సినిమాకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో అభయ్ వర్మ హీరోగా పరిచయమయ్యాడు. షర్వారీ వాగ్ హీరోయిన్‌గా నటించింది. మోనా సింగ్.. మరో కీలక పాత్రలో కనిపించింది. మొత్తానికి మొదటి సినిమాతోనే 7.5 రేటింగ్‌ను దక్కించుకొని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు అభయ్ వర్మ.


Also Read: వారం రోజుల వరకు నా గొంతు పనిచేయదు - ‘కల్కి 2898 AD’పై రేణు దేశాయ్ రివ్యూ