కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి బలంగా ప్రూవ్ చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty Movie). కంటెంట్ ఉన్న కథకు స్టార్స్ సపోర్ట్ చేస్తే ఏ విధమైన రిజల్ట్ వస్తుందో కూడా బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు... థియేటర్లలో జనాల నవ్వులే చెప్పాయి. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన సినిమాల్లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఒకటి. థియేటర్లలో నవ్వించిన ఈ సినిమా... ఇప్పుడు ఓటీటీల్లో నవ్వించడానికి వస్తోంది. 


అక్టోబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల!
Miss Shetty Mr Polishetty OTT Platform : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వారమే తమ ఓటీటీ వేదికలో సినిమాను విడుదల చేస్తోంది.
 
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల చేశారు. ఓటీటీలో ఈ నాలుగు భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. అక్టోబర్ 5 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ జీ సొంతం చేసుకుంది.


Also Read : ప్రభాస్, నయనతారే కాదు... విష్ణు మంచు 'కన్నప్ప'లో మలయాళ స్టార్ కూడా!
 
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి మొదలు పెడితే... అగ్ర కథానాయకులు చిరంజీవి, మహేష్ బాబు, రవితేజతో పాటు హీరోయిన్ సమంత తదితరులు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మీద ప్రశంసల జల్లు కురిపించారు. థియేటర్లలో సినిమాకు మంచి స్పందన లభించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.  


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఏంటి? అనేది చూస్తే... అన్విత శెట్టి (అనుష్క) ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని అనుకోదు. వివాహ బంధానికి ఆమె వ్యతిరేకం. దానికి కారణం ఆమె తల్లిదండ్రుల మధ్య జరిగిన పరిణామాలు! అయితే... తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనం ఫీలై... తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని పెళ్ళి చేసుకోకుండా బిడ్డకు జన్మ ఇవ్వాలని అనుకుంటుంది. అప్పుడు ఆమెకు సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది కథ.   


Also Read 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?



తెలుగు చలన చిత్రసీమలో అగ్ర కథానాయికలలో ఒకరైన అనుష్క శెట్టి (Anushka)  సుమారు ఐదేళ్ల విరామం తర్వాత వెండితెరపై సందడి చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'బాహుబలి 2', 'భాగమతి' చిత్రాల తర్వాత ఆమెకు థియేట్రికల్ రిలీజ్ ఇదే. ఇందులో ఆమెకు జోడీగా యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత దీంతో ఆయన హ్యాట్రిక్ అందుకున్నారు. 'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial