హీరోయిన్ హెబ్బా పటేల్ (Hebah Patel) పేరు చెబితే ప్రేక్షకులకు ముందుగా 'కుమారి 21 ఎఫ్' సినిమా గుర్తు వస్తుంది. ఎందుకంటే... ప్రేక్షకులపై సుకుమార్ నిర్మాణంలో వచ్చిన సినిమా ప్రభావం అటువంటిది. దానికంటే ముందు 'అలా ఎలా?' చేసినా... 'కుమారి 21 ఎఫ్'తో హెబ్బాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత గ్లామర్ రోల్స్ ఎక్కువ చేశారు. అయితే... ఇప్పుడు హెబ్బా పటేల్ రూట్ మార్చారు. గ్లామర్ పక్కన పెట్టి నటనకు ప్రాముఖ్యం ఇస్తూ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్, డీ - గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. 'ఓదెల రైల్వే స్టేషన్'తో రూటు మార్చిన హెబ్బా పటేల్... ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు.
ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'
హెబ్బా పటేల్ (Hebah Patel New Movie) ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' (The Great Indian Suicide Movie). ఇందులో రామ్ కార్తీక్ హీరోగా నటించారు. సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో దర్శకుడు విప్లవ్ కోనేటి (Viplove Koneti) స్వీయ నిర్మాణంలో తెరకెక్కింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.
అక్టోబర్ 6న 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' చిత్రాన్ని తమ ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనున్నట్లు ఆహా తెలిపింది. నిజం చెప్పాలంటే... ఈ సినిమాకు ముందు 'తెలిసిన వాళ్ళు' టైటిల్ పెట్టారు. ఇప్పుడు టైటిల్ మార్చి ఆహాలో విడుదల చేస్తున్నారు.
Also Read : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
భార్యా భర్తలుగా నరేష్, పవిత్
రమదనపల్లి పట్టణంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' తెరకెక్కించామని విప్లవ్ కోనేటి తెలిపారు. ''ఎమోషనల్ డ్రామా, మనసును తాకే థ్రిల్స్, అనూహ్యమైన రొమాన్స్... సినిమాలో అన్నీ ఉంటాయి. హెబ్బా పటేల్, రామ్ కార్తీక్ నటనతో పాటు వాళ్ళ జోడీ ఆకట్టుకుంటుంది. సినిమాలో సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ భార్యా భర్తలుగా నటించారు'' అని ఆయన తెలిపారు.
హెబ్బా పటేల్ నటించిన 'ఓదెల రైల్వే స్టేషన్' ఆహాలో విడుదలైంది. ఇప్పుడు 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' కూడా ఆహాలో విడుదలకు రెడీ అవుతోంది. నరేష్ విజయ కృష్ణ, పవిత్రా లోకేష్ జంటగా నటించిన 'మళ్ళీ పెళ్లి' కూడా ఆహాలో విడుదలైంది.
Also Read : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
హెబ్బా పటేల్, రామ్ కార్తీక్, సీనియర్ నరేష్ (Naresh VK), పవిత్రా లోకేష్, జయ ప్రకాష్ నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అజయ్ వి నాగ్, అనంత్ నాగ్ కావూరి, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, సాహిత్యం: డాక్టర్ జివాగో, నృత్యాలు : జావేద్ మాస్టర్, పోరాటాలు : సీహెచ్ రామకృష్ణ, కళ : ఉపేందర్ రెడ్డి, సంగీతం : శ్రీ చరణ్ పాకాల, కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకత్వం,నిర్మాత : విప్లవ్ కోనేటి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial