Sundeep Kishan's Mazaka OTT Release On Zee5: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌‍టైనర్ 'మజాకా' (Mazaka). ఫిబ్రవరి 26న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌‍డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఉగాది సందర్భంగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ మూవీ ఈ నెల 28 నుంచి ప్రముఖ ఓటీటీ 'జీ5'లోకి (Zee5) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. 'థమాకా' ఫేం నక్కిన త్రినాథరావు సినిమాకు దర్శకత్వం వహించగా.. అన్షు, రీతూవర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. సినిమాలో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి, గగన్ విహారి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్

కథ ఏంటంటే..?

కృష్ణ (సందీప్ కిషన్)కు చిన్నప్పుడే తల్లి మరణిస్తుంది. దీంతో కొడుకును వెంకటరమణ (రావు రమేష్) తన స్నేహితునిలా పెంచుతాడు. అప్పటి నుంచి వేరే పెళ్లి ఆలోచనే అతనికి ఉండదు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ ఉంటారు. కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫోటో చూసుకోవాలని వెంకటరమణ ఆశపడతాడు. అయితే, కొడుక్కి పిల్లనిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో తాను పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలూ తీరుతాయని అంతా సలహా ఇస్తాడు.

దీంతో కొడుక్కి పెళ్లీడు వచ్చిన టైంలో యశోద (అన్షు)తో లవ్‌లో పడతాడు. మరోవైపు కృష్ణ మీరాతో (రీతూవర్మ) ప్రేమలో ఉంటాడు. ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకేసారి లవ్ లెటర్స్ రాసుకుంటూ బస్టాపుల చుట్టూ తిరుగుతూ గడిపేస్తుంటారు. ఈ క్రమంలో తండ్రి ప్రేమ విషయం కొడుక్కి, కొడుకు ప్రేమ విషయం తండ్రికి ఎప్పుడు తెలిసింది? ఇద్దరి ప్రేమకు అడ్డు వచ్చిన భార్గవ వర్మ (మురళీ శర్మ) ఎవరు? యశోద, మీరా మధ్య శత్రుత్వం ఏమిటి? తమ పంతం కోసం ప్రేమను అయినా వదులుకునేంతగా వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? యశోద, మీరాను ఒక్కటి చేసి, తమకు ఎదురైన అడ్డంకులను తొలగించి వీరు వారిద్దరినీ పెళ్లిళ్లు చేసుకున్నారా? లేదంటే వారితో పడలేక మధ్యలోనే వదిలేశారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు సందీప్ కిషన్. త్వరలో సందీప్.. కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో 'సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రానుంది. ఇది ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్లాట్ ఫాం నుంచి వస్తోన్న ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లో మిథిలా పాల్కర్ హీారోయిన్‌గా నటిస్తుండగా.. మురళీశర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.