Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Sunny Deol: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ దేవోల్ అక్కడి నిర్మాతలపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. వారు సౌత్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. సౌత్ వాళ్లకు కథే హీరో అని చెప్పారు.

Sunny Deol's JAAT Trailer Released: బాలీవుడ్ నిర్మాతలు దక్షిణాది సినిమాలు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ దేవోల్ అన్నారు. జైపూర్‌లో 'జాట్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. సౌత్ వారు సినిమాలు ప్రాణంగా పెట్టి తీస్తారని.. దర్శకుడికి నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇస్తారని అన్నారు. ఇక్కడి మూవీస్‌లో కథే హీరో అని చెప్పారు. మళ్లీ ఛాన్స్ వస్తే ఇదే సౌత్ దర్శకునితో మరో సినిమా చేయాలని ఉందంటూ సన్నీ చెప్పారు.
జాట్ ట్రైలర్ రిలీజ్..
సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ 'జాట్' (JAAT). ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సన్నీ దేవోల్ మాస్ యాక్షన్ వేరే లెవల్‌లో ఉంది. ఓ పొలంలో నాగలితో తవ్వుతుండగా డెడ్ బాడీస్ బయటపడడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
'ఈ లంకలో అడుగు పెట్టాలంటే ఆ దేవుడు కూడా భయపడతాడు.' అంటూ రెజీనా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'ఈ చేతికి ఉన్న పవరేంటో మొత్తం ఉత్తరాది చూసింది. ఇప్పుడు దక్షిణాది చూడనుంది.' అని సన్నీ చెప్పే డైలాగ్స్ బట్టి యాక్షన్ సీన్స్ ఏ లెవల్‌లో ఉండనున్నాయో అర్థమవుతోంది.
ఏప్రిల్ 10న రిలీజ్
ఈ మూవీలో సన్నీ దేవోల్ సరసన సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లుగా నటించారు. రణతుంగ పాత్రలో పవర్ ఫుల్ విలన్‌గా రణదీప్ హుడా కనిపిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: నితిన్ 'రాబిన్ హుడ్' ఓటీటీ డీల్ ఫిక్స్! - థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలో స్ట్రీమింగ్