Bandhavi Sridhar OTT Streaming On Amazon Prime Video: ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగానే హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లనే ఎక్కువగా ప్రముఖ ఓటీటీలు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా.. హారర్ జానర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'మసూద' (Masooda) మూవీ మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ 'ఆహా'లో (Aha) స్ట్రీమింగ్ అవుతోంది.


ఆ ఓటీటీలో స్ట్రీమింగ్


ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ 'మసూద' మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీలో సంగీత (Sangeetha), తిరువీర్ (Thiruveer), కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. సాయికిరణ్ తెరకెక్కించారు. శుభలేఖ సుధాకర్, సత్యప్రకాష్‌లు సైతం కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాహుల్ నక్కా యాదవ్ నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందించారు.


Also Read: ఓటీటీలోకి ఒకే రోజు రెండు బ్లాక్ బస్టర్ మూవీస్! - విక్రమ్ 'వీర ధీర శూరన్', మోహన్ లాల్ 'L2: ఎంపురాన్', ఎందులో స్ట్రీమింగ్ అంటే?


స్టోరీ ఏంటంటే?


నీలం (సంగీత) తన భర్తకు దూరంగా ఉంటూ తన కుమార్తె నాజియాతో (కావ్య కల్యాణ్ రామ్) కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటుంది. ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన నజియా దెయ్యం పట్టినట్లుగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. దీంతో ఆందోళనకు గురైన నీలం.. అదే అపార్డ్‌మెంట్‌లో ఉండే గోపి (తిరువీర్) సాయం కోరుతోంది. అసలే ధైర్యం లేని గోపి ఆమెకు ఎలా సాయం చేశాడు. నాజియాను ఆ దెయ్యం బారి నుంచి ఎలా కాపాడాడు?, అసలు ఆ ఆత్మ వెనుక కథేంటి?, ఆత్మ నాజియాను ఎందుకు పట్టుకుంది? నీలంకు ఎదురైన భయానక అనుభవాలేంటి? వంటివి తెలియాలంటే మూవీ చూడాల్సిందే.


మరో బ్లాక్ బస్టర్ కూడా..


తాజాగా మరో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సైతం 'అమెజాన్ ప్రైమ్'లోకి గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ హిట్ 'వీర ధీర శూరన్ పార్ట్ 2' సైతం అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా.. 'విముక్తి నుంచి ప్రతీకారం వరకూ.. ఒక రాత్రి ప్రతిదీ మారుస్తుంది.' అని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.


ఈ మూవీ మార్చి 27న థియేటర్లలో విడుదల కాగా.. తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించగా.. విక్రమ్‌ సరసన దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. తమిళ స్టార్ ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. 


గ్రామంలో ఓ కిరాణా కొట్టు నడుపుకొనే కాళి (విక్రమ్) జీవితంలో జరిగిన కథ. గతంలో కొట్లాటలకు ప్రాధాన్యమిచ్చే కాళి ఎందుకు మారాడు?, మళ్లీ ఆ గొడవల్లో దూరడానికి కారణం ఏంటి?, ఊరిలో ఉన్న పెద్ద మనిషికి, కాళికి ఉన్న సంబంధం ఏంటి?, శత్రువుల నుంచి కాళి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.