Mayur More's Black White And Gray Love Kills OTT Release On Sonyliv: హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ అంటేనే ఓ క్రేజ్. ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా అలాంటి కంటెంట్‌నే ప్రముఖ ఓటీటీలు ప్రస్తుతం అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో పాటు కామెడీ అడ్వెంచర్ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నాయి.

మర్డర్ మిస్టరీ సిరీస్

క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన వెబ్ సిరీస్ 'బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్' (Black White And Gray Love Kills). మయూర్ మోర్, పాలక్ జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషించగా.. పుష్కర్ సునీల్ దర్శకత్వం వహించారు. ఈ క్రైమ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'సోనీలివ్'లో (Sonyliv) మే 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గతంలోనే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా.. మరో ట్రైలర్‌ రిలీజ్ చేసింది.

ఓ ఫిక్సనల్ క్రైమ్ డ్రామాకు డాక్యుమెంటరీల్లో ఉపయోగించే అసలు ఫుటేజీని ఉపయోగించారు. ఒరిజినల్ క్రైమ్‌కు సంబంధించిన అదే ఫుటేజీతో పాటు తాము రూపొందించిన ఫిక్షనల్ సిరీస్ విజువల్స్‌ను సైతం తాజా ట్రైలర్ వీడియోలో చూపించారు.

నాగపూర్ శివారు ప్రాంతంలో వరుస హత్యలు కలకలం రేపుతుండగా.. ఓ యువకుడు వాటిని చేశాడంటూ పోలీసులు అతనిపై అభియోగాలు మోపుతారు. దీని వెనుక ఉన్న నిజాలను ఓ జర్నలిస్ట్ వెలికితీస్తాడు. విచారణలో భాగంగా నిందితుడు చెప్పే విషయాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. 

Also Read: ఓటీటీలోకి ఒకే రోజు రెండు బ్లాక్ బస్టర్ మూవీస్! - విక్రమ్ 'వీర ధీర శూరన్', మోహన్ లాల్ 'L2: ఎంపురాన్', ఎందులో స్ట్రీమింగ్ అంటే?

కామెడీ అడ్వంచర్ 'బ్రొమాన్స్'

ఇటీవల థియేటర్స్‌లో రిలీజ్ అయి మంచి హిట్ అందుకుంది మలయాళ కామెడీ అడ్వెంచర్ మూవీ 'బ్రొమాన్స్' (Bromance). హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహంపై , హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సీన్స్‌తో ఈ మూవీ తెరకెక్కింది. మే 1 నుంచి 'సోనీలివ్' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అరుణ్ డి.జోస్ దర్శకత్వంలో తెరకెక్కగా.. మ్యాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, భరత్ బోపన్న, శ్యామ్ మోహన్, కలభవన్ షాజోన్  ప్రధాన పాత్రలు పోషించారు. 

ఈ అడ్వెంచర్ కామెడీ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. కనిపించకుండా పోయిన తన అన్నయ్యను తమ్ముడు వెతికే కథాంశంతోనే ఈ మూవీ తెరకెక్కింది. ఈ కథంతా ఓ రాత్రిలోనే జరుగుతుంది. తన అన్నను వెతికే క్రమంలో తమ్ముడికి ఎవరెవరు పరిచయం అయ్యారు?, వారు చేసిన సాయం ఏంటి?, చివరకు అతనికి అన్నయ్య దొరికాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.