Sharwanand's Manamey Movie OTT Release On Aha: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand), కృతిశెట్టి (KrithShetty) జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా 'మనమే' (Manamey). దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

'ఆహా'లో స్ట్రీమింగ్

ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లోనూ (Aha) 'మనమే' సినిమా ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. 'ఆకర్షణ గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతుంది? 'మనమే' జరుగుతుంది.' అని క్యాప్షన్ ఇచ్చారు. గతేడాది జూన్ 7న సినిమా రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించగా.. హీషం అబ్దుల్ వహాద్ సంగీతం అందించారు. సినిమాలో రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు.

Also Read: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ - బాబాయ్‌తో కలిసి నటించడంపై కల్యాణ్ రామ్ ఏమన్నారంటే?

స్టోరీ ఏంటంటే?

ఈ సినిమా కథ విషయానికొస్తే.. లండన్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన విక్రమ్ (శర్వానంద్) ఖాళీగా ఉంటూ గాలికి తిరుగుతూ ఎలాంటి బాధ్యత లేకుండా అలా సరదాగా తిరిగేస్తుంటాడు. అనాథైన తన ప్రాణ స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్)ను చిన్నప్పటి నుంచి అన్నీ తానై చూసుకుంటాడు. ఓ రోజు జరిగిన ప్రమాదంలో అనురాగ్, అతని భార్య శాంతి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతారు. దీంతో అనాథగా మారిన వాళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) సంరక్షణ విక్రమ్‌పై పడుతుంది.

ఇదే సమయంలో శాంతి స్నేహితురాలు సుభద్ర (కృతిశెట్టి) సైతం ఖుషీ బాధ్యతను చూసుకుటుంది. అలా వీరిద్దరూ పెళ్లి కాకుండానే కలిసి పేరెంట్స్‌గా ఖుషి బాధ్యతను బుజాలకెత్తుకుంటారు. బాధ్యత లేని విక్రమ్, అన్నీ పర్‌ఫెక్ట్‌గా చూసుకునే సుభద్ర కలిసి పిల్లాడిని ఎలా పెంచారు?. ఖుషి వచ్చాక వారి జీవితంలో జరిగిన పరిణామాలేంటి? అసలు, జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్), కార్తీక్ (శివ కందుకూరి) ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.