టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 'జాక్'. 'కొంచెం క్రాక్' అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీ పార్టనర్ డీటైల్స్ రివీల్ అయ్యాయి. 'జాక్' మూవీ థియేట్రికల్ రన్ తరువాత నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
'జాక్' స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే... బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'జాక్' సినిమాలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీని ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొచ్చారు. రిలీజ్‌కు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను 'నెట్ ఫ్లిక్స్' ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. థియేట్రికల్ రన్ తరువాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. మూవీ రిలీజ్ అయ్యే దాకా ఈ మూవీ రైట్స్‌ను ఏ ఓటీటీ దక్కించుకుంది అన్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు మేకర్స్. ఎట్టకేలకు థియేటర్లలోనే ఈ విషయాన్ని రివీల్ చేశారు. మరి ఈ మూవీ రైట్స్ డీల్ ఎంత ధరకు సెట్ అయ్యింది అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక సాధారణంగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
టిల్లుగాడి స్పీడ్‌కు బ్రేకులు డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న హీరో సిద్దు జొన్నలగడ్డ. 'జాక్' సినిమా ద్వారా స్పై యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్టుగా కనిపిస్తోంది. ఫ్యామిలీ కథలు, లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఈసారి జానర్ మార్చి 'జాక్' మూవీని తెరకెక్కించడంతో స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్‌గా సాగిందని ట్విటర్లో కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలో సిద్దు జొన్నలగడ్డ వన్ లైనర్స్, కామెడీ టైమింగ్, హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ, స్పై యాక్షన్ అంశాలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా థ్రిల్ చేయలేదని అంటున్నారు. అలాగే సినిమాకు మ్యూజిక్ మైనస్ పాయింట్‌గా నిలిచిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్‌ఎక్స్‌పై కూడా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో హ్యాట్రిక్ అందుకుంటాడనుకున్న సిద్దు జొన్నలగడ్డ స్పీడ్‌కి ఈ మూవీతో బ్రేక్ పడినట్టుగా అయ్యిందని అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి రిలీజ్‌కి ముందు టీజర్, ట్రైలర్లతో 'జాక్' సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగలిగారు మేకర్స్. కానీ థియేటర్లోకి వచ్చాక అంచనాలను అందుకోవడంలో విఫలమైనట్టుగా కనిపిస్తోంది.