ఓటీటీలకు ఆదరణ పెరిగిన తర్వాత కథానాయికలకు, అందాల భామలకు సరికొత్త అవకాశాలు వస్తున్నాయి. కేవలం కమర్షియల్ సినిమాల్లో సన్నివేశాలు, పాటలకు మాత్రమే పరిమితం కావడం లేదు. వెబ్ సిరీస్ (Web Series)లలో విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సైతం వెబ్ సిరీస్ (ఓటీటీ ప్రాజెక్టు)లకు ఓకే చెబుతున్నారు. ఆల్రెడీ ఓ వెబ్ సిరీస్ చేసిన ఆమె... ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. 


లావణ్యకు జోడీగా 'బిగ్ బాస్' అభిజిత్
Lavanya Tripathi latest web series : లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందుతున్న సిరీస్ ఇది. 


ఇందులో లావణ్యా త్రిపాఠికి జోడీగా 'బిగ్ బాస్' ఫేమ్, దాని కంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో ఓ హీరోగా నటించిన అభిజిత్ నటిస్తున్నారు. విశ్వక్ ఖండే రావు దర్శకుడు. ఇంతకు ముందు 'స్కైలాబ్' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 


రొమాన్స్ అండ్ కామెడీ...
ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
రొమాంటిక్ కామెడీగా లావణ్య త్రిపాఠి, అభిజిత్ (Bigg Boss Abhijeet) వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సిరీస్‌లతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుందని, వీక్షకులకు ఓ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సిరీస్ అనౌన్స్ చేయలేదు. త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.


పెళ్లి కోసం త్వరగా ఫినిష్ చేస్తున్న లావణ్య
Lavanya Tripathi Wedding : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో ఏడు అడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. అందుకని, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సిరీస్ త్వరగా ఫినిష్ చేయాలని, స్పీడు స్పీడుగా షూటింగ్ చేస్తున్నారు.


Also Read షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?


 
లావణ్య త్రిపాఠి సెన్సాఫ్ హ్యూమర్ తనకు చాలా ఇష్టమని ఆ మధ్య వరుణ్ తేజ్ చెప్పారు. లావణ్య స్నేహితులు సైతం ఆమె పక్కన ఉంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే... స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో కామెడీ చేసే అవకాశం ఆమెకు ఎప్పుడూ రాలేదు. బహుశా... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిరీస్ ఏమైనా తీరుస్తుందేమో చూడాలి. ఈ సిరీస్ కాకుండా తమిళంలో అథర్వ ('గద్దలకొండ గణేష్' ఫేమ్) సరసన ఓ సినిమా చేయడానికి కూడా లావణ్య త్రిపాఠి అంగీకరించారు. 


Also Read : శెట్టి పోలిశెట్టి ఓటీటీ ఒకరికి, టీవీ ఇంకొకరికి - ఏ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?


వచ్చే నెలలో వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి!
ప్రస్తుతం తల్లిదండ్రులు, చెల్లెలు నిహారికతో కలిసి వరుణ్ తేజ్ ఫారిన్ ట్రిప్ వేశారు. బహుశా... పెళ్లి షాపింగ్ అనుకుంట! వచ్చే నెల... నవంబర్‌లో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అని సమాచారం. తొలుత ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి జరుగుతుందని వినిపించినా... అది ఒక ఆప్షన్ మాత్రమే అని వరుణ్ చెబుతున్నారు. పెళ్లికి కొణిదెల, అల్లు ఫ్యామిలీలతో పాటు చిత్రసీమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించనున్నారు.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial