ETV Win March Release Movies: ఈ సమ్మర్‌లో డిఫరెంట్ స్టోరీస్, ఫ్యామిలీ వెబ్ సిరీస్‌లతో పాటు చిన్నారులను అలరించే కార్టూన్ షోస్‌ను అందుబాటులోకి తెస్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్' (ETV Win). ఇటీవలే రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈ తెలుగు వినోదాల వేదిక.. రాబోయే రోజుల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, సిరీస్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా, మార్చిలో అందుబాటులోకి రాబోయే సినిమాలను నెట్టింట పంచుకుంది. ప్రతీ వారం ఓ సరికొత్త చిత్రంతో ఎంటర్‌టైన్ చేయనుంది. 

లవ్ ఎంటర్‌టైనర్.. ధూం ధాం

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చేతన్ కృష్ణ, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం 'ధూం ధాం'. సాయికిశోర్ మచ్చ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాయికుమార్, వెన్నెల కిశోర్, గోపరాజు రమణ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు, యూత్‌ను ఈ చిత్రం అలరిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ నెల 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Also Read: విజయ్ సేతుపతి కాదు... బాలీవుడ్ హీరో కోసం రాసిన కథ... కల్ట్ క్లాసిక్ '96'ను మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా?

గోదారోడంటే మామూలుగా ఉండదు

సాధారణంగా గోదారోలంటే మామూలుగా ఉండదు. అలాంటి గోదారి జిల్లాలోని లంపకలోవ గ్రామంలో పుట్టిన ఓ యువకుడి కథే 'పరాక్రమం'. అనామిక, కిరీటి, మోహన్ సేనాపతి మూవీలో కీలక పాత్రలు పోషించారు. యువకుడి జీవితంలో గల్లీ క్రికెట్, లవ్, నాటకాలు, రాజకీయం వంటి అంశాలతో జరిగిన పరిణామాలను ఓ పల్లెటూరి కథగా మలిచారు. బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూనే.. స్వీయ దర్శకత్వం వహించారు. ఈ మూవీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు 'ఈటీవీ విన్'లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

యథార్థ సంఘటనల ఆధారంగా..

1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ 'జితేందర్ రెడ్డి'. రాకేశ్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీకి విరించి వర్మ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటే ఈ ఏడాది మొత్తం కొత్త చిత్రాలు, సిరీస్‌లతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనుంది. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ ప్రేక్షకుల్నీ అలరించనుంది. ఈ ఏడాది 16కు పైగా ఒరిజినల్ మూవీస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రేక్షకులకు అందించనున్నామని పేర్కొంది. ప్రతి గురువారం ఓ కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన 'అనగనగా', వర్ష బొల్లమ్మ 'కానిస్టేబుల్ కనకం', శివాజీ ''#SSS', AIR వెబ్ సిరీస్ వంటి వాటితో ఎంటర్‌టైన్ చేయనున్నట్లు పేర్కొంది.

Also Read: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్