ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల యుగం నడుస్తోంది. ఉత్తరాది దక్షిణాది అని తేడా లేకుండా సౌత్ డైరెక్టర్స్ నార్త్ హీరోలతో, నార్త్ హీరోలు సౌత్ డైరెక్టర్స్ తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటిదాకా షారుక్ ఖాన్ - అట్లీ 'జవాన్', రణబీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' లాంటి సౌత్, నార్త్ కాంబోలో వచ్చిన సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. అయితే గతంలో పరిస్థితి వేరేగా ఉండేది. ఒక భాషకు చెందిన నటులు వేరే భాషల సినిమాల్లో నటించాలి అంటే ఆలోచించేవారు. అయితే ఇతర భాషలలో బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ చేయడానికి మాత్రం ఆసక్తిని కనబరిచేవారు. కానీ తమిళ సినిమా ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్ గా మిగిలిన '96' మూవీని ముందుగా ఓ హిందీ హీరోని దృష్టిలో పెట్టుకొని రాశారట. కానీ సదరు డైరెక్టర్ పలు కారణాల వల్ల ఈ మూవీని విజయ్ సేతుపతితో తీశాడు.


'96' మూవీని చేజార్చుకున్న హీరో 
సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ '96'. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించారు. రామ్ - జానుల లవ్ స్టోరీ గురించి రూపొందిన ఈ మూవీ సౌత్ లోనే బెస్ట్ కల్ట్ క్లాసిక్ సినిమాల లిస్టులో చేరిపోయింది. ముఖ్యంగా సినిమాలో విజయ్ సేతుపతి - త్రిష కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సినిమాలో ఏ మాత్రం గ్లామర్ కి చోటు లేకపోయినా, హీరో హీరోయిన్ల మధ్య మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు లేకపోయినా అద్భుతమైన విజయాన్ని సాధించింది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని చేర్చుకున్న ఆ హిందీ హీరో ఎవరో కాదు జూనియర్ బచ్చన్. ఆయన కావాలని ఈ మూవీని మిస్ చేసుకోలేదు. 


Also Readప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్‌ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!


ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. తను అభిషేక్ బచ్చన్ ను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని రాసినట్టు వెల్లడించారు. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 7వ ఇండియన్ స్క్రీన్ రైటర్స్ కాన్ఫరెన్స్ లో ప్రేమ్ ఈ విషయాన్ని వివరించారు. ఆయన మాట్లాడుతూ "96 మూవీని ముందుగా హిందీలో తీయాలని రాసుకున్నాను. అప్పుడు హీరోగా అభిషేక్ బచ్చన్ ను అనుకున్నాను. కానీ నాకు పెద్దగా పరిచయాలు లేకపోవడంతో ఈ మూవీని విజయ్ సేతుపతితో తీశాను" అంటూ చెప్పుకొచ్చారు. 


ఏ ఓటీటీలో ఉందంటే ?
ఇక 18 కోట్ల బడ్జెట్ తో రూపొందిన '96' మూవీ కమర్షియల్ గానూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను కన్నడలో '99'గా, తెలుగులో 'జాను'గానూ రీమేక్ చేశారు. అయితే తెలుగులో స్వయంగా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఈ మూవీని రీమేక్ చేసినప్పటికీ, ఆ మ్యాజిక్ ని మాత్రం రీ క్రియేట్ చేయలేకపోయారు.



Also Read: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం