Kathir's Karthika OTT Streaming On Aha: క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడని వారుండరు. మూవీ లవర్స్‌కు ఫుల్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ప్రస్తుతం అలాంటి కంటెంట్‌నే పలు ఓటీటీలు ఎక్కువగా అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా.. మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది.


క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్


తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'యుగి'. తెలుగులో 'కార్తిక: ది మిస్సింగ్ కేస్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో భవానీ మీడియా రిలీజ్ చేస్తోంది. శుక్రవారం నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి జాక్ హారిస్ దర్శకత్వం వహించగా.. కథిర్, నట్టి, నరైన్, జోజూ జార్జ్, ఆనంది, ఆత్మేయ రాజన్, పవిత్ర లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


స్టోరీ ఏంటంటే?


కార్తిక అనే అమ్మాయి మిస్సింగ్ కేసును ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్ బృందానికి ఎదురైన సవాళ్లేంటి? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీని రూపొందించారు. ఓ వివాహిత మృతి కేసును కూడా ఇందులో చూపించారు. అయితే.. అమ్మాయి మిస్సింగ్‌కు మర్డర్ కేసుకు సంబంధం ఏంటనేదే తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఆద్యంతం థ్రిల్లింగ్, ట్విస్టులతో ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ వీకెండ్ ఈ థ్రిల్లింగ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.


Also Read: 3 వారాలకే ఓటీటీలోకి విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'ఏస్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?