Vijay Sethupathi's Ace Movie OTT Streaming On Amazon Prime Video: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఏస్'. మే 23న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడన్‌గా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.


ఎందులో స్ట్రీమింగ్ అంటే?


ఈ మూవీ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయిన 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి అర్ముగ కుమార్ దర్శకత్వం సహా నిర్మాతగానూ వ్యవహరించారు. విజయ్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. మూవీని 7 సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించగా.. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‍‌పై బి.శివప్రసాద్ రిలీజ్ చేయనున్నారు.


Also Read: బాలయ్య ‘పెద్దన్నయ్య’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ TO మహేష్ ‘రాజకుమారుడు’, ప్రభాస్ ‘సాహో’ వరకు- ఈ శుక్రవారం (జూన్ 13) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..


స్టోరీ ఏంటంటే?


జైలు జీవితం గడిపిన బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) ఉద్యోగం కోసం మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తాడు. జ్ఞానానందం (యోగిబాబు) సాయంతో కల్పన (దివ్య పిళ్లై)కి చెందిన రెస్టారెంట్‌లో వంటవాడిగా ఉద్యోగంలో చేరతాడు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో కాశీతో రుక్మిణి (రుక్మిణి వసంత్) ప్రేమలో పడుతుంది. ఆమె సమస్యల్లో ఉందని తెలిసి కాశీ.. గ్యాంగ్‌స్టర్ ధర్మ (బీఆర్ అవినాష్) పోకర్ అడ్డాలో జూదం ఆడతాడు. ఫస్ట్ బాగా గెలిచి డబ్బులు సంపాదించినా.. ధర్మ ఛీటింగ్‌తో రూ.2 కోట్ల వరకూ బాకీ పడతాడు.


దీంతో వారం లోపు తన డబ్బులు ఇవ్వాలని లేకుంటే ప్రాణాలు తీస్తానని బోల్ట్ కాశీకి ధర్మ వార్నింగ్ ఇస్తాడు. సమస్యల నుంచి గట్టెక్కేందుకు బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఓ వైపు పోలీసులు.. మరోవైపు ధర్మ మనుషులు కాశీ కోసం వెంటపడతారు. అసలు వారి నుంచి కాశీ ఎలా తప్పించుకున్నాడు? సవతి తండ్రి రాజదురై (బబ్లూ పృథ్వీరాజ్)తో రుక్మిణికి ఎదురైన సమస్య ఏమిటి? అందరి సమస్యలను బోల్ట్ కాశి ఎలా తీర్చాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.


థ్రిల్లర్ మూవీస్ కూడా..


ఈ మూవీతో పాటే మరో లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ కూడా 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది. నవీన్ చంద్ర, రాశీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'బ్లైండ్ స్పాట్'. శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఓ వివాహిత మృతి కేసును సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఎలా ఛేదించాడనేదే ప్రధానాంశంగా ఈ మూవీ రూపొందింది. మరింకెందుకు ఆలస్యం ఈ వీకెండ్‌లో ఓటీటీలో మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి.