'బాహుబలి', 'కేజీఎఫ్', 'స్త్రీ' ఫ్రాంచైజీ తర్వాత ప్రేక్షకుల అంచనాలను మించి సక్సెస్ అందుకున్న సినిమాల జాబితాలో 'కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1' (Kantara A Legend Chapter-1) సైతం చేరింది. పైన పేర్కొన్న మూడు సినిమాలకు సీక్వెల్స్ వస్తే... 'కాంతార'కు ప్రీక్వెల్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా... అతి త్వరలో, అదీ ఈ వారమే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.
ఓటీటీలోకి 'కాంతార చాప్టర్ 1' వచ్చేది ఆ రోజే!Kantara Chapter 1 OTT Release Date Announced: రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించడంతో పాటు 'కాంతార చాప్టర్ 1' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయిక. కథానుగుణంగా సినిమా ప్రారంభ సన్నివేశాల్లో అందంగా, అనుకువగా కనిపించిన ఆమె... పతాక సన్నివేశాలకు వచ్చేసరికి మరొక కోణం చూపించారు. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి అద్భుత ప్రదర్శన చేశారు.
గాంధీ జయంతి నాడు... అక్టోబర్ 2న థియేటర్లలో 'కాంతార చాప్టర్ 1' విడుదల కాగా, నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 31వ తేదీ నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అనౌన్స్ చేసింది. కన్నడ సహా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ మాత్రం మరో నాలుగు వారాల తర్వాత ఓటీటీకి వస్తుందని టాక్.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
థియేటర్లలో రూ. 800 కోట్లు... 'కాంతార' కథ ఏమిటి?బాక్స్ ఆఫీస్ దగ్గర 800 కోట్ల రూపాయలను 'కాంతార' కలెక్ట్ చేసింది. హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో 13వ స్థానం సొంతం చేసుకుంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు. దీనికి సీక్వెల్ కింద 'కాంతార ఛాప్టర్ 2'ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!
'కాంతార చాప్టర్ 1' కథ విషయానికి వస్తే... 8వ శతాబ్దంలో కదంబుల రాజ్య పాలనలో అటవీ భూమి కాంతారలో ఒక గిరిజన తెగ జీవిస్తుంటుంది. కాంతార దైవిక భూమి. అక్కడ ఈశ్వరుని పూదోట, అందులోని మార్మిక బావికి శక్తులు ఉంటాయి. ఆ భూమి మీద దుష్టశక్తుల కన్ను పడకుండా గిరిజన తెగ కాపాడుతుంది. అయితే కదంబ యువరాజు కులశేఖరుడి (గుల్షన్ దేవయ్య) కన్ను ఈశ్వరుని పూదోట మీద పడుతుంది. ఆ భూమిని బెర్మే (రిషబ్ శెట్టి) ఎలా రక్షించాడు? రాజకుమార్తె కనకవతి (రుక్మిణీ వసంత్) ఏం చేసింది? మహారాజు రాజశేఖరుడు (జయరామ్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.