'కాంతార చాప్టర్ 1'లో రిషబ్ శెట్టి (Rishab Shetty) నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. విమర్శకుల నుంచి సామాన్యుల వరకు ఆయన తప్ప మరొకరు ఆ పాత్ర చేయలేరని ప్రశంసించారు. 'కాంతార'కు నేషనల్ అవార్డు అందుకున్న ఆయన, మరోసారి అందుకునే అవకాశం ఉందని పలువురు జోస్యం చెప్పారు. 'కాంతార చాప్టర్ 1'లో బెర్మే పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. అది అందరికీ తెలుసు. అయితే సినిమా ప్రారంభంలో, మధ్యలో కీలక సన్నివేశాల్లో, క్లైమాక్స్‌లో వచ్చే 'మాయావి' (కన్నడలో మాయ కర) పాత్రలో కూడా రిషబ్ శెట్టి నటించారని తెలుసా?
మాయావి మేకప్ కోసం 6 గంటలు!Who Played Mayakara In Kantara Chapter 1?: 'కాంతార చాప్టర్ 1'లో మాయావి పాత్రలో నటించింది ఎవరు? ఈ ప్రశ్నకు స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సమాధానం చెప్పింది. అదీ వీడియో రూపంలో!
మాయావి మేకప్ కోసం ఆరు గంటలు పట్టింది. మాయావి పాత్ర నేపథ్యంలో సీన్స్ తీసినప్పుడు తెల్లవారుజామున ఆరు గంటలకు రిషబ్ శెట్టి సెట్స్‌కు వచ్చారని, అప్పుడు కూర్చుంటే తొమ్మిది గంటల వరకు మేకప్ కోసం టైం స్పెండ్ చేశారని చెప్పుకొచ్చింది హోంబలే ఫిలిమ్స్ సంస్థ. మేకప్ ఎలా వేసినది వీడియో తీసి మరీ పోస్ట్ చేసింది. రిషబ్ శెట్టి డెడికేషన్, కమిట్మెంట్ చూసి క్లాప్స్ కొడుతున్నారు ఆడియన్స్.
Also Read: అనిల్ రావిపూడి కాదు... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ - దిల్ రాజు సినిమా?
'కాంతార'కు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక, ఈ 'కాంతార చాప్టర్ 1'కు సైతం ఆయనకు నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ అని మాయావి క్యారెక్టర్ మేకప్ వీడియో చూశాక పలువురు అభిప్రాయపడుతున్నారు. 'కాంతార'లో చేసిన పాత్రకు, ఇప్పుడీ ప్రీక్వెల్‌లో చేసిన రెండు పాత్రలకు అసలు సంబంధం లేదు. ఆ మూడూ వేర్వేరు పాత్రలు. డిఫరెన్స్ ఉంది. పైగా, ఇప్పుడు ఒక్క సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు రిషబ్ శెట్టి. రెండు రోల్స్ మధ్య చాలా వేరియేషన్ చూపించారు. అందువల్ల ఆయనకు నేషనల్ అవార్డు ఇవ్వడంలో తప్పు లేదనేది అభిమానులతో పాటు కొందరు విశ్లేషకులు చెప్పే మాట.
Also Read: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ రీల్... ఇన్‌స్టాలో వైరల్ వీడియో
ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళుతోంది 'కాంతార చాప్టర్ 1'. థియేటర్లలో ఈ సినిమా విడుదలై 25 రోజులు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కలిపి 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో కనకవతి పాత్రలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటించగా... రాజుగా మలయాళ నటుడు జయరామ్, ఆయన కుమారుడిగా హిందీ నటుడు గుల్షన్ దేవయ్య తదితరులు నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.