Rajya Sabha member Niranjan Reddy film journey: ఎస్ నిరంజన్ రెడ్డి... సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి... ఆయన గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు, రాజకీయాలు ఫాలో అయ్యే ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా 'ఆచార్య' ప్రొడ్యూస్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తరఫున సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును వాదించినది ఆయనే. రాజకీయాలకు వెళితే... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులను న్యాయవాది కూడా ఆయనే. నిరంజన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ కూడా. వైసీపీ ఆయన్ను పెద్దల సభకు పంపింది. అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన ప్రయాణం ఎప్పుడు మొదలైందో తెలుసా?
నిరంజన్ రెడ్డి కోసం వర్మ రికమండేషన్!'శివ' సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ తర్వాత ఆయన కేవలం దర్శకత్వానికి పరిమితం కాలేదు. నిర్మాతగానూ సినిమాలు చేశారు. అందులో 'శివ'కు కో డైరెక్టర్ అయినటువంటి శివ నాగేశ్వర రావును దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'మనీ' ఒకటి.
'మనీ' చిత్రానికి దర్శకత్వ శాఖలో ఎస్ నిరంజన్ రెడ్డి పని చేశారు. ఆ మూవీ టైటిల్ కార్డ్స్ చూస్తే... అసోసియేట్ దర్శకులుగా ఉత్తేజ్, రమణ - అసిస్టెంట్ దర్శకులుగా శ్రీనివాస్, నిరంజన్ పేర్లు కనిపిస్తాయి. ఆ నిరంజన్, ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న 'ఆచార్య' నిర్మాత ఎస్ నిరంజన్ రెడ్డి ఒక్కరే. 'మనీ' సినిమా దర్శకత్వ శాఖలో ఆయనను తీసుకోమని రికమండ్ చేసింది రామ్ గోపాల్ వర్మే. నిర్మాత చెబితే కాదని ఎవరైనా అంటారా? అప్రెంటిస్‌గా పెట్టుకోమని పంపించిన కుర్రాడు నిరంజన్ రెడ్డికి ఎడిటింగ్ రిపోర్ట్ రాసే పని అప్పగించారు. అతడిని ఉత్తేజ్ గైడ్ చేసేవారు. 'మనీ' తర్వాత ఇండస్ట్రీలో నిరంజన్ రెడ్డి కనిపించలేదని, కొన్నాళ్ళకు 'మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్' సంస్థ స్థాపించి నిర్మాతగా ఇండస్ట్రీలోకి వచ్చారని ప్రముఖ జర్నలిస్ట్ - నంది పురస్కార గ్రహీత - పీఆర్వో పులగం చిన్నారాయణ పేర్కొన్నారు. తన ఫేస్ బుక్ పేజీలో ఈ వివరాలు తెలిపారు.
Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!
నిరంజన్ రెడ్డిని 'మనీ' వదల్లేదు!'మనీ' తర్వాత ఇండస్ట్రీని వదిలేసి నిరంజన్ రెడ్డి వెళ్లారు. అయితే ఆయన్ను మనీ వదల్లేదు. ప్రముఖ న్యాయవాదిగా వేలు, లక్షల్లో ఫీజు తీసుకునే స్థాయికి తెచ్చింది. నిర్మాతగా మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించేలా చేసింది. కింగ్ అక్కినేని నాగార్జున 'గగనం', అడివి శేష్ 'క్షణం', రానా దగ్గుబాటి 'ఘాజీ', నాగార్జున 'వైల్డ్ డాగ్', చిరంజీవి - రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. పీవీపీ, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలతో కలిసి ఆయన సినిమాలు చేశారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి నిరంజన్ రెడ్డి విరామం ఇచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంది.
Also Read: హీరోగా మారుతున్న కమెడియన్ సత్య... దర్శకుడు ఎవరో తెలుసా?