బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంటుంది. ఇటీవల ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ధాకడ్' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకి డైరెక్టర్ గా పని చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు ఓ రేంజ్ లో బజ్ వచ్చింది.
కానీ రిలీజ్ తరువాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మొదటి రోజు నుంచే సినిమాకి నెగెటివ్ టాక్ మొదలైంది. రూ.85కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.2.58 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కంగనా కెరీర్ లో ఇదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. నిజానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చాలా సంస్థలు ముందుకొచ్చాయి.
కానీ నిర్మాతలు మాత్రం థియేటర్లోనే సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. తీరా చూస్తే.. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఓటీటీ రైట్స్ కి అనుకున్న మొత్తంలో రేటు పలకలేదు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి చీప్ గా రూ.5 కోట్లకు అమ్మేశారు. జీ5 సంస్థ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తుంది. జూలై1 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఓటీటీలోనైనా ఈ సినిమా వర్కవుట్ అవుతుందేమో చూడాలి!
Also Read: కరణ్ జోహార్ కిడ్నాప్ - బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ఇదే!
Also Read: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్