ఇటీవల ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూమూస్ వాలాను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ హత్యను గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అని పోలీసుల విచారణలో తెలిపింది. ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేష్ కాంబ్లే కూడా ఉన్నారు. అయితే సిద్ధేష్ ను విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. 


బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసుకుందట ఈ గ్యాంగ్. కరణ్ జోహార్ ను కిడ్నాప్ చేసి ఆయన నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బు రాబట్టాలని అనుకున్నారట. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లకు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. 


ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. పోలీసులు సల్మాన్ కోసం సెక్యూరిటీ పెంచారు. కొన్నేళ్లక్రితం కృష్ణజింకను వేటాడినందుకు సల్మాన్ ను చంపేస్తామని ఈ గ్యాంగే బెదిరించింది. ఇప్పుడు కరణ్ జోహార్ ను డబ్బు కోసం కిడ్నాప్ చేయాలనుకున్నట్లు తెలిసింది. ఇదంతా చూస్తుంటే.. బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లుంది. ఇది వారిని కంగారు పెట్టే విషయమే. 


Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది


Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?