కేవలం నటుడవ్వాలన్న కోరికతోనే అమెరికాను వదిలి హైదరాబాద్ వచ్చారు అడివి శేష్. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా అవకాశాలను దక్కించుకుంటూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. చిన్న సినిమాలతోనే హిట్ లు కొట్టి చూపించారు. ఈ మధ్యనే విడుదలైన అతని సినిమా ‘మేజర్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అడివి శేష్ కు మంచి గుర్తింపును సాధించి పెట్టింది. ఈ సందర్భంగా ఆయన చాలా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్య్వూలలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధంచి చాలా విషయాలు పంచుకున్నారు.
అవును ప్రేమించా...
‘అమెరికాలో పూర్తిగా పెరిగినా ఇండియా అంటే ఇష్టం. సినిమాల్లో చేయాలనే ఉద్దేశం నాలో బలంగా ఉంది. ఒక స్టార్ హీరో కొడుకుకున్న క్రేజ్‌ను చూసి నాలో మరింత కసి పెరిగింది. స్టార్ హీరోగా బ్రాండ్ క్రియేట్ చేయాలనిపించింది. అందుకే సినిమాల విషయంలో విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకున్నా. నా సినిమాల్లో డ్యూయెట్ పాటలు కూడా పెద్దగా ఉండవు. డ్యాన్స్ సరిగా రాదనే భావన నాది. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే నేను కూడా అమెరికాలో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించా. ఆమె పంజాబీ. మా రిలేషన్ కొన్నాళ్లు బాగానే నడిచింది. కానీ తరువాత మాత్రం దూరం పెరిగింది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నాం. ఆమె పెట్టి కూడా అయిపోయింది. అది కూడా నా పుట్టినరోజునాడే. ఆ తరువాత కూడా చాలా సార్లు ప్రేమలో పడ్డాను. కానీ ఏ ప్రేమను పనెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం రాలేదు’ అని చెప్పాడు అడివి శేష్.
పెళ్లి గురించి...
‘ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని చెబుతుంటారు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే. ప్రస్తుతం మా చెల్లి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం. ఇప్పట్లో నా పెళ్లి ఉండకపోవచ్చు’ అని చెప్పారు.
Also read: బాలయ్యతో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రకటించిన ఆహా టీమ్, ఎప్పట్నించంటే
Also read: సోనమ్‌తో ఫోటోలు పెట్టాక చాలా ట్రోల్ చేశారు, హేట్ కామెంట్లను పట్టించుకోను అంటున్న లియో కళ్యాణ్