Indian Idol Season 2 : బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ తో విజయాలు అందుకుంటున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్.. 'ఆహా'లో ప్రసారం కానున్న 'తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2' గ్రాండ్ ఫినాలే కు గెస్ట్ జడ్జ్ గా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆహా మరో క్రేజ్ అప్ డేట్ ను రిలీజ్ చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ ప్రోమోను రిలీజ్ చేసింది.


ఈ ప్రోమో వీడియోను బట్టి చూస్తే అల్లు అర్జున్ ఎంట్రీ మామూలుగా లేదనిపిస్తోంది. ఆయన్ను బాణాసంచాతో వెల్కమ్ చెప్పారు. డ్యాన్సర్స్ అంతా 'పుష్పా' మూవీ కాస్ట్యూమ్‌లో 'ఏ బిడ్డా.. ఇది నా అడ్డా' అనే సాంగ్ కు ప్రదర్శన ఇస్తుండగా అల్లు అర్జున్ వారి వెనుక నుంచి ఎంట్రీ ఇచ్చారు. దాన్ని చూసిన సింగర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అరుస్తూ కనిపించారు. ఈ క్లిప్‌లో మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే సింగర్స్ పాడిన ఓ పాటకు ఆయన ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా 'ఇంత మంచి సాంగ్ ను విన్నపుడు డ్యాన్స్ చేస్తే కిక్ వస్తుంది.. కానీ జడ్జిగా కూర్చున్నాను కదా బాగోదని ఆపేసుకున్నాంటూ' బన్నీ చెప్పే డైలాగ్ ఈ ప్రోమోకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అంతే కాదు 'పెద్దరికం కూడా ఆపేస్తుంద'ని చెప్పి నవ్వే నవ్వులకు అందరూ ఫిదా అవుతున్నారు. వీడియో చివర్లో ఓ చిన్నారికి ముద్దు పెట్టిన అల్లు అర్జున్.. ఎంట్రీ సమయంలో డ్యాన్సర్ తో పాటు తగ్గేదేలే అని చేప్పే డైలాగ్ కు తగినట్టుగా ఆయన ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.



ఇక అల్లు అర్జున్ సినిమా విషయాలకొస్తే ఆయన ప్రస్తుతం టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న “పుష్ప ది రూల్”తో బిజీగా ఉన్నారు. పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


నెక్స్ట్ ఏంటీ..


పుష్ప సెన్సేషనల్ సీక్వెల్ తర్వాత ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లు ఏంటి అనేది ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన విషయంగా మారింది. ఆల్రెడీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన బన్నీ... ఈ సినిమాతో పాటుగా మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'పుష్ప 2' తర్వాత  ఇమీడియేట్ ప్రాజెక్ట్ గా త్రివిక్రమ్ తో సినిమా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు వచ్చే ఏడాది వేసవి తర్వాత నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానున్నట్టు సమాచారం. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఫిక్స్ అయ్యిందనే బజ్ ఉంది. ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 


Read Also : Allu Arjun Trivikram Movie : గీతాలో వచ్చే ఏడాది అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా - 'పుష్ప 2' తర్వాత సినిమా ఫిక్స్!